ఇమ్మిగ్రేషన్ రేటు తక్కువ ఉన్న దేశాల నుంచి వస్తున్న వారికి 'డైవర్సిటీ ఇమ్మిగ్రెంట్ వీసీ' (డీవీ) ప్రోగ్రామ్ ద్వారా 55వేల ఇమ్మిగ్రెంట్ వీసాలను అమెరికా ప్రతియేటా అందిస్తుంది. ఈ ప్రోగ్రామ్‌కి డీవై లాటరీ లేదా గ్రీన్ కార్డ్ లాటరీ అన్న పేర్లు ఉన్నాయి. అసలేంటి గ్రీన్ కార్డ్ లాటరీ? అర్హత ఏంటి? భారతీయులు అప్లై చేయవచ్చా? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
గ్రీన్ కార్డ్ లాటరీ పద్ధతిలో ప్రతియేటా 55వేల మందికి అమెరికా శాశ్వత నివాసాన్ని మంజూరు చేస్తుంది.
అమెరికా గ్రీన్ కార్డ్ లాటరీ డ్రాలో మీరు పేరు పిక్ అయిన వెంటనే శాశ్వత నివాస హోదా దక్కదు! దీని తర్వాత ఇంకాస్త ప్రాసెస్ ఉంటుంది.
గత 5ఏళ్లల్లో ఏ దేశం నుంచైతే 50వేల మందికిపైగా వలసదారులు అమెరికాలోకి వచ్చి ఉంటారో, ఆయా ప్రాంతాల నుంచి వస్తున్న వారికి ఈ గ్రీన్ కార్డ్ లాటరీలో పాల్గొనే అర్హత లేదు!
ఈ గ్రీన్ కార్డ్ లాటరీ మీరు కేవలం ఒక్కసారి మాత్రమే ఎంట్రీ ఇవ్వగలరు. ఒకటికి మించి ఎంట్రీలు సమర్పిస్తే, ఆటోమెటిక్‌గా అనర్హులవుతారు.
ప్రభుత్వానికి చెందిన అధికారిక వెబ్సైట్లో నుంచే గ్రీన్ కార్డ్ లాటరీకి అప్లై చేయాలి. వేరే సోర్సులను నమ్మకూడదు.
అమెరికా విడుదల చేసిన గ్రీన్ కార్డ్ లాటరీ ఎలిజిబులిటీ లిస్ట్‌లో భారత్ పేరు లేదు. ఇండియా నుంచి అత్యధిక మంది అమెరికాకు వెళుతుండటం ఇందుకు కారణం.
అయితే, లిస్ట్‌లో ఉన్న దేశాల్లో పుట్టిన వారు ఈ లాటరీకి అప్లై చేసుకోవచ్చు. ఆయా దేశాల్లో పుట్టిన భారతీయులు కూడా అప్లై చేసుకోవచ్చు!
గ్రీన్ కార్డ్ లాటరీకి అర్హత ఉన్న దేశాలు- అల్జీరియా, అంగోలా, బెనిన్, బోట్స్వానా, బుర్కినా ఫాసో, బురుండి, కామెరూన్, కాబో వెర్డే, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, చాద్, కొమొరోస్, కాంగో, ఐవరీ కోస్ట్, జిబౌటి, ఈజిప్ట్, ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, ఎస్వాటిని, ఇథియోపియా, గాబన్, గాంబియా, ఘనా, గినియా, గినియా-బిస్సావు, కెన్యా, లెసోతో, లైబీరియా, లిబియా, మడగాస్కర్, మలావి, మాలి, మౌరిటానియా, మారిషస్, మొరాకో, మొజాంబిక్, నమీబియా, నైజర్, రువాండా, సావో టోమ్ మరియు ప్రిన్సిపే, సెనెగల్, సీషెల్స్, సియెర్రా లియోన్, సోమాలియా, దక్షిణాఫ్రికా, దక్షిణ సూడాన్, సూడాన్, టాంజానియా, టోగో, ట్యునీషియా, ఉగాండా, జాంబియా, జింబాబ్వే.
సంబంధిత కథనం