New districts : ఆ రాష్ట్రానికి కొత్తగా 7 జిల్లాలు.. సీఎం ప్రకటన-west bengal to get 7 new districts announces cm mamata banerjee ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  West Bengal To Get 7 New Districts, Announces Cm Mamata Banerjee

New districts : ఆ రాష్ట్రానికి కొత్తగా 7 జిల్లాలు.. సీఎం ప్రకటన

Sharath Chitturi HT Telugu
Aug 01, 2022 03:44 PM IST

New districts in West Bengal : కొత్తగా 7 జిల్లాలను ప్రవేశపెడుతున్నట్టు సీఎం ప్రకటించారు. ఫలితంగా పశ్చిమ్​ బెంగాల్​లో జిల్లాల సంఖ్య 30కి చేరనుంది.

ఆ రాష్ట్రానికి కొత్తగా 7 జిల్లాలు.. సీఎం ప్రకటన
ఆ రాష్ట్రానికి కొత్తగా 7 జిల్లాలు.. సీఎం ప్రకటన (LiveMint)

New districts in West Bengal : రాష్ట్రంలో కొత్తగా 7 జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్టు పశ్చిమ్​ బెంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ప్రకటించారు. ఇదే జరిగితే.. పశ్చిమ్​ బంగాల్​లో మొత్తం జిల్లాల సంఖ్య 30కి చేరుతుంది.

ట్రెండింగ్ వార్తలు

7 జిల్లాల్లోని ఆరింటికి పేర్లు కూడా వచ్చేశాయి. అవి.. సుందర్​బన్​, ఇఛ్చిమతి, రణఘాట్​, బిష్ణుపూర్​, జాంగిపూర్​, బెహ్రంపూర్​. బాసిహ్ట్​ నుంచి మరొక జిల్లాను తీసుకొస్తున్నారు.

"ఇప్పటివరకు 23 జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని 30కి చేస్తున్నాము," అని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు.

అదే సమయంలో.. ఈ నెల 3న.. కేబినెట్​ పునర్​వ్యవస్థీకరణను చేపట్టనున్నట్టు మమత తెలిపారు. కొత్తగా నలుగురు- ఐదుగురు కేబినెట్​లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.

"చాలా శాఖలకు మంత్రులు లేరు. అవన్నీ నా భుజాలపై మోసుకోలేదు. మొత్తం కేబినెట్​నే తొలగించాలన్న ఆలోచన లేదు," అని పశ్చిమ్​ బెంగాల్​ సీఎం స్పష్టం చేశారు.

టీఎంసీ నేత పార్థా ఛట్టర్జీ అరెస్ట్​ నేపథ్యంలో కేబినెట్​ మార్పుల వ్యవహారం సర్వత్రా చర్చకు దారితీసింది.

గ్రూప్​ సీ, గ్రూప్​ డీ సిబ్బంది, టీచర్లు, 11-12 తరగతులకు అసిస్టెంట్​ టీచర్ల నియామకంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. టీచర్స్​ జాబ్​ స్కామ్​పై దర్యాప్తు చేపట్టాలని సీబీఐని ఆదేశించింది కోల్​కతా హైకోర్టు. ఈక్రమంలోనే ఎఫ్​ఐఆర్​ నమోదు చేసింది సీబీఐ. ఆ ఎఫ్​ఐఆర్​ ఆధారంగా.. ఈ పూర్తి వ్యవహారంలో మనీలాండరింగ్​ కోణాన్ని పరిశీలించేందుకు ఈడీ దర్యాప్తు చేపట్టింది.

స్కామ్​ జరిగిందని అంటున్న సమయంలో పార్థ ఛటర్జీ.. రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. అందుకే ఆయన్ని అరెస్ట్​ చేశారు. ఆయనకు అత్యంత సన్నిహితురాలిగా పేరొందిన అర్పితా ముఖర్జీని సైతం ఈడీ అధికారులు అరెస్ట్​ చేశారు. ఆమె ఆస్తుల్లో నుంచి ఇప్పటికే రూ. 50కోట్ల నగదు, రూ. లక్షలు విలువ చేసే ఆభరణాలు బయటపడ్డాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్