Anantnag encounter: వారం పాటు కొనసాగిన అనంత నాగ్ ఎన్ కౌంటర్; లష్కరే తోయిబా కమాండర్ హతం-weeklong anantnag encounter ends lashkar commander body recovered j k police ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Week-long Anantnag Encounter Ends, Lashkar Commander Body Recovered: J-k Police

Anantnag encounter: వారం పాటు కొనసాగిన అనంత నాగ్ ఎన్ కౌంటర్; లష్కరే తోయిబా కమాండర్ హతం

ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో భద్రతాదళాలు
ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో భద్రతాదళాలు

Anantnag encounter: దాదాపు వారం పాటు కొనసాగిన అనంత నాగ్ ఎన్ కౌంటర్ ఎట్టకేలకు ముగిసింది. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ కమాండర్ ను భద్రతాదళాలు హతమార్చాయి.

Anantnag encounter: జమ్మూకశ్మీర్ లోని అనంత నాగ్ జిల్లాలో గత వారం ప్రారంభమైన బీకర ఎన్ కౌంటర్ ఎట్టకేలకు ముగిసింది. లష్కరే తోయిబా స్థానిక కమాండర్ ఉజైర్ ఖాన్ ను భద్రతా దళాలు హతమార్చాయని, అతడి మృతదేహాన్ని కూడా స్వాధీనం చేసుకున్నామని కశ్మీర్ అదనపు డీజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. మరో ఉగ్రవాది మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవాల్సి ఉందన్నారు.

ట్రెండింగ్ వార్తలు

గాలింపు కొనసాగుతుంది..

ఎన్ కౌంటర్ ముగిసింది కానీ ఆ ప్రాంతంలో ఇతర ఉగ్రవాదులు కానీ, వారి సామగ్రి కానీ ఉందేమోనన్న కోణంలో గాలింపు కొనసాగుతుందని కశ్మీర్ అదనపు డీజీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ ఎదురు కాల్పుల్లో మరో ఉగ్రవాది కూడా ఉండి ఉండవచ్చన్న అనుమానం ఉందన్నారు. అనంత్ నాగ్ జిల్లాలోని గారోల్ అటవీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ప్రాంతం అత్యంత విశాలంగా ఉన్నందున, లష్కరే తోయిబా స్థానిక కమాండర్ ఉజైర్ ఖాన్ కు ఈ ప్రాంతం కొట్టిన పిండి అయినందున ఎన్ కౌంటర్ క్లిష్టంగా మారిందన్నారు. ఈ ఎన్ కౌంటర్ లో 19 రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన కల్నల్ మన్ ప్రీత్ సింగ్, మరో మేజర్ ఆశిష్ దోంచక్, డీఎస్పీ కేడర్ లో ఉన్న జమ్మూకశ్మీర్ పోలీస్ అధికారి హుమాయిన్ భట్, ఆర్మీ జవాను ప్రదీప్ ప్రాణాలు కోల్పోయారు. ఎన్ ౌంటర్ జరిగిన అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని ఏడీజీపీ విజయ్ కుమార్ స్థానికులను కోరారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదులకు చెందిన గ్రెనేడ్ లు, మందుపాతరలు ఉండి ఉండవచ్చని హెచ్చరించారు.

డ్రోన్లతో..

ఈ ఎన్ కౌంటర్ లో సాయుధ డ్రోన్లు, హెలీకాప్టర్ల సేవలను భద్రతా దళాలు ఉపయోగించుకున్నాయి. డ్రోన్ల సాయంతో ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేశాయి. డ్రోన్ కు అమర్చిన కెమెరా సాయంతోనే ఒక ఉగ్రవాది మరణించిన విషయాన్ని నిర్ధారించాయి.