Weather update : ఇక్కడ వర్షాలు- అక్కడ భానుడి భగభగలు.. ఐఎండీ కీలక అలర్ట్​!-weather update today heatwave alert in up mp and jharkhand ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Weather Update : ఇక్కడ వర్షాలు- అక్కడ భానుడి భగభగలు.. ఐఎండీ కీలక అలర్ట్​!

Weather update : ఇక్కడ వర్షాలు- అక్కడ భానుడి భగభగలు.. ఐఎండీ కీలక అలర్ట్​!

Sharath Chitturi HT Telugu
Jun 07, 2024 08:15 AM IST

Telangana Rains today : గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, అసోం, మేఘాలయ, పశ్చిమబెంగాల్, సిక్కింలో జూన్ 10 వరకు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కాగాా ఉత్తర భారతంలోని పలు ప్రాంతాలకు హీట్​వేవ్​ అలర్ట్​ ఇచ్చింది.

 ఇక్కడ వర్షాలు- అక్కడ భానుడి భగభగలు..
ఇక్కడ వర్షాలు- అక్కడ భానుడి భగభగలు..

Hyderabad rains today : దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల జోరు కనిపిస్తోంది. గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, అసోం, మేఘాలయ, పశ్చిమ్​ బెంగాల్, సిక్కింలో జూన్ 10 వరకు, కేరళలో జూన్ 9 వరకు, తమిళనాడు, పుదుచ్చేరిలో జూన్ 7 వరకు, ఆంధ్రప్రదేశ్​లో జూన్ 9, 10 తేదీల్లో, తెలంగాణలో జూన్ 10న, అరుణాచల్​ ప్రదేశ్​లో జూన్ 8 నుంచి 10 వరకు, నాగాలాండ్​లో జూన్ 10 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.

జూన్ 7న రాజస్థాన్​లో వడగండ్ల వానలతో పాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

Andhra Pradesh rains : అదే సమయంలో ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో వడగాల్పుల ప్రభావం కొనసాగుతుంది. ఐఎండీ అంచనా ప్రకారం జూన్ 7న ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.

  • మధ్యప్రదేశ్, ఝార్ఖండ్​లో జూన్ 10 వరకు, పంజాబ్, హరియాణా, బిహార్, ఒడిశాలో జూన్ 8 నుంచి జూన్ 10 వరకు వడగాల్పులు వీస్తాయని తెలిపింది.
  • జూన్ 8 నుంచి 10 వరకు ఉత్తరప్రదేశ్​లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
  • జూన్ 7న ఒడిశా, బిహార్​లో, జూన్ 10 వరకు పశ్చిమబెంగాల్లో వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని తెలిపింది.

నైరుతి రుతుపవనాలు..

  • Telangana rains : తాజా అప్​డేట్స్ ప్రకారం నైరుతి రుతుపవనాలు ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లలో ప్రవేశించాయి. జూన్​ 10 నాటికి రుతుపవనాలు ముంబైని తాకుతాయి.
  • రానున్న 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఛత్తీస్​గఢ్, ఒడిశాలో మరింత విస్తరించే అవకాశం ఉంది.
  • అరుణాచల్ ప్రదేశ్, అసోం, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, మేఘాలయ, పశ్చిమ్​ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో జూన్ 11 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తన వాతావరణ బులెటిన్​లో పేర్కొంది.
  • జూన్ 6న విడుదల చేసిన పత్రికా ప్రకటనలో.. అసోం, మేఘాలయ, సబ్ హిమాలయన్ పశ్చిమ్​ బెంగాల్, సిక్కింలో 06-10 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 08-10 మధ్య అరుణాచల్ ప్రదేశ్; 2024 జూన్ 10న నాగాలాండ్​లో వర్షాలు పడతాయని స్పష్టం చేసింది.
  • రానున్న 5 రోజుల్లో కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడా, సౌరాష్ట్ర, కచ్, కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ, తెలంగాణ, కర్ణాటకలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 06-08 మధ్య తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ కేరళ- మాహేలో వర్షాలు కురుస్తాయి.
  • 10 వరకు భారీ వర్షాలు; గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, అసోం, మేఘాలయ, పశ్చిమబెంగాల్, సిక్కింలో జూన్ 10 వరకు, కేరళలో జూన్ 9 వరకు; తమిళనాడు, పుదుచ్చేరిలో జూన్ 7 వరకు; ఆంధ్రప్రదేశ్​లో జూన్ 9, 10 తేదీల్లో, తెలంగాణలో జూన్ 8 నుంచి 10 వరకు; అరుణాచల్ ప్రదేశ్​లో జూన్ 8 నుంచి 10 వరకు, నాగాలాండ్ లో జూన్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం