Heavy rains alert : ఈ రాష్ట్రాల్లో 5 రోజులు భారీ వర్షాలు.. కానీ!
Heavy rains alert : దేశవ్యాప్తంగాా అనేక ప్రాంతాల్లో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. కాగా.. జులైలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది.
Heavy rains alert : దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో కీలక్ అప్డేట్ ఇచ్చింది భారత వాతావరణశాఖ (ఐఎండీ). కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లో రానున్న 5 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ట్రెండింగ్ వార్తలు
"జులై 2 నుంచి దక్షిణ ద్వీపకల్పంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్య- దక్షిణ ఉత్తర ప్రదేశ్‌లో సైక్లోనిక్ సర్క్యులేషన్ కొనసాగుతోంది," అని తాజా బులిటెన్‌లో వెల్లడించింది ఐఎండీ.
హిమాచల్ ప్రదేశ్‌లో ఇప్పటికే భారీ వర్షాలు పడుతున్నాయి. అనేక ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. జనజీవనం స్తంభించింది. ఇక ముంబైలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. శనివారం ఉదయం భారీ వర్షం పడింది. గోవింది ప్రాంతంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
వివిధ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ ఇలా..
వాయువ్య భారతం:- మరో రెండు రోజుల పాటు ఈ ప్రాంతంలో మోస్తారు వర్షపాతం నమోదవుతుంది. పశ్చిమ- తూర్పు రాజస్థాన్, పశ్చిమ్- తూర్పు, ఉత్తర్ ప్రదేశ్‌లో శనివారం జోరుగా వర్షాలు కురుస్తాయి.
మధ్య భారతం:- మధ్యప్రదేశ్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో రెండు రోజుల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి.
పశ్చిమ భారతం:- కోంకణ్, గోవా, మహారాష్ట్ర ఘాట్ ప్రాంతాల్లో 5 రోజుల పాటు, గుజరాత్లో 2 రోజుల పాటు వానలు పడతాయి.
తూర్పు- ఈశాన్య భారతం:- పశ్చిమ్ బెంగాల్‌లోని హిమాలయ ప్రాంతం, సిక్కిం, బిహార్, అసోం- మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో 5 రోజుల పాటు అతి భారీ వర్షాలు కురవొచ్చు. పశ్చిమ్ బంగాల్లోని గంగా నది తీర ప్రాంతంలో 3న వర్షాలు పడతాయి. ఝార్ఖండ్, ఒడిశాల్లో ఈ నెల 3,4 తేదీల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది.
దక్షిణ భారతం:- 5 రోజుల పాటు కేరళ, మహే, కర్ణాటక తీర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడొచ్చు. మధ్య కర్ణాటక, తమిళనాడులో 2 నుంచి 4 వరకు, ఆంధ్రప్రదేశ్ తీర- రాయలసీమలో 3 నుంచి 4 వరకు, తెలంగాణలో 4వ తేదీన వర్షాలు పడే అవకాశం ఉంది.
జులైలో సాధారణ వర్షపాతమే..!
Rainfall predictions in July 2023 : ఐఎండీ ప్రకారం జూలైలో తూర్పు ఉత్తర్ ప్రదేశ్, దక్షిణ బిహార్‌లను మినహాయించి దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదుకానుంది. అయితే.. జూన్‌లో ఏర్పడిన లోటును జులైలో వర్షాలు భర్తీ చేస్తాయని పేర్కొంది.
జూన్‌లో 16 రాష్ట్రాల్లో లోటు వర్షపాతం నమోదైంది. మరీ ముఖ్యంగా బిహార్, కేరళలో 69శాతం, 60శాతం తక్కువగా వర్షాలు పడ్డాయి. ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలోనూ నైరుతి రుతుపవనాల తొలి నెలలో వర్షాలు సరిగ్గా కురవలేదు.
సంబంధిత కథనం