నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ వెల్లడించింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.వీటితో పాటు కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్రలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది.
హిమాచల్ ప్రదేశ్‌లో ఇప్పటివరకు రుతుపవనాల ప్రభావం పెద్దగా కనిపించలేదు. కానీ శిమ్లాలో శనివారం మళ్లీ వర్షాలు కురిశాయి. జూలై 30 వరకు మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
ఉనా, బిలాస్పూర్, హమీర్పూర్, మండి, కాంగ్రా, కులు, సోలన్, శిమ్లా సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ అంచనా వేసింది. సిర్మౌర్, చంబా, కిన్నౌర్, లాహౌల్-స్పితి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ సూచించింది.
జూలై 28న గుజరాత్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. జూలై 31న మధ్యప్రదేశ్‌లో, 28న గోవా, మహారాష్ట్రలో 28, 29 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
జూలై 27న విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం.. “జులై 30, 31 తేదీలలో ఉత్తరాఖండ్‌లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది; జులై 28న తూర్పు రాజస్థాన్.. జులై 31 వరకు హిమాచల్ ప్రదేశ్, హరియాణా, దిల్లీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జమ్ముకశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ నెల 30, 31 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూలై 28, 29 తేదీల్లో ఉత్తరాఖండ్‌లో, జులై 31 వరకు రాజస్థాన్‌లో, జులై 30, 31 తేదీల్లో ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయి,” అని వాతావరణ శాఖ తెలిపింది.
జులై 28న కేరళ, మాహే, 28న కోస్తా కర్ణాటకలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటకలో జూలై 30 వరకు, కేరళలో జూలై 29, 30 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
నాగాలాండ్, మణిపూర్లలో ఈ నెల 29, 30 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సిక్కింలో జులై 29 వరకు, పశ్చిమ బెంగాల్లో జులై 31 వరకు, బిహార్‌లో వచ్చే మూడు రోజుల్లో, ఝార్ఖండ్‌లో జూలై 30, 31 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఒడిశాలో జూలై 31 వరకు, అరుణాచల్ ప్రదేశ్‌లో జులై 28, 29 తేదీల్లో, అసోం, మేఘాలయలో జూలై 31 వరకు, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో జూలై 28, 31 తేదీల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ వివరించింది.
మరోవైపు దిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజేంద్ర నగర్లో విషాదరకర ఘటన చోటుచేసుకుంది. ఓ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి వరద నీరు పోటెత్తింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం