AIMIM leader's comments: ముగ్గురు భార్యలున్నామేం అందరినీ గౌరవిస్తాం.. కానీ మీరు?-we have 3 wives and respect each but hindus aimim leader s remark sparks row ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  'We Have 3 Wives And Respect Each, But Hindus..: Aimim Leader's Remark Sparks Row

AIMIM leader's comments: ముగ్గురు భార్యలున్నామేం అందరినీ గౌరవిస్తాం.. కానీ మీరు?

HT Telugu Desk HT Telugu
Oct 15, 2022 05:10 PM IST

AIMIM leader's comments on Hindus: AIMIM నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూపీ AIMIM అధ్యక్షుడిగా ఉన్న షౌకత్ అలీ హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

AIMIM ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు షౌకత్ అలీ
AIMIM ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు షౌకత్ అలీ

AIMIM ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు షౌకత్ అలీ శనివారం అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను హిందూ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

AIMIM leader's comments on Hindus: ముగ్గురు భార్యలున్నా..

ఒక సభలో మాట్లాడుతూ AIMIM ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు షౌకత్ అలీ శనివారం ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మనం ముగ్గురు, ముగ్గురిని వివాహం చేసుకుంటూ ఉంటామని అంటుంటారు. కానీ మనం రెండు పెళ్లిళ్లు చేసుకున్నా, మూడు పెళ్లిళ్లు చేసుకున్నా… అందరినీ సమానంగా గౌరవిస్తాం. ఎవరికీ అన్యాయం చేయం. కానీ, హిందువులు ఒక్కరినే పెళ్లి చేసుకుంటారు. కానీ, మరో ఇద్దరు ముగ్గురితో సంబంధం పెట్టుకుంటారు. వారు అటు భార్యను గౌరవించరు. ఇటు సంబంధం పెట్టుకున్న వారినీ గౌరవించరు. మనం ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా, అందరికీ సమాన గౌరవం ఇస్తాం. వారికి జన్మించిన పిల్లలకు రేషన్ కార్డుల్లో పేరు కల్పిస్తాం’’ అని షౌకత్ అలీ వ్యాఖ్యానించారు

AIMIM leader's comments on Hindus: హిజాబ్ నిషేధంపై..

హిజాబ్ నిషేధంపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ.. ‘ఎవరు హిజాబ్ ధరించాలి అనేది ఈ దేశంలో హిందుత్వ వాదులు కాదు నిర్ణయించాల్సింది. అది రాజ్యాంగం నిర్ణయిస్తుంది. ఇలాంటి విషయాలను వివాదాస్పదం చేస్తూ బీజేపీ దేశాన్ని చీల్చాలని చూస్తోంది’ అని ఆరోపించారు.

AIMIM leader's comments on Hindus: కావాలనే ముస్లింలను టార్గెట్

హిజాబ్, వక్ఫ్, మదరాసా.. అంటూ ముస్లింలను టార్గెట్ చేస్తున్నారని షౌకత్ ఆరోపించారు. బీజేపీ బలహీనపడనప్పుడల్లా.. ముస్లింలను టార్గెట్ చేసి, రాజకీయంగా బలపడుతుంది‘ అన్నారు.

IPL_Entry_Point