ప్రకృతి విపత్తుతో అల్లకల్లోలంగా మారిన కేరళ వయనాడ్ నుంచి ఎన్నో బాధాకరమైన దృశ్యాలు బయటకు వస్తున్నాయి. వీటి మధ్య మేజర్ సీతా అశోక్ షెల్కే ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. మేజర్ టీమ్ యుద్ధప్రాదిపతికన, కేవలం 16 గంటల్లోనే వంతెనను నిర్మిచడం ఇందుకు కారణం.
కేరళ వయనాడ్‌లోని కొండచరియలు విరిగిపడిన చూరల్మాల గ్రామంలో కొత్తగా నిర్మించిన బెయిలీ బ్రిడ్జి రెయిలింగ్స్పై ఓ మహిళా ఆర్మీ అధికారి సగర్వంగా నిలబడిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వంతెన నిర్మాణానికి బాధ్యత వహించిన భారత ఆర్మీ యూనిట్‌లోని ఏకైక మహిళా అధికారి మేజర్ సీతా అశోక్ షెల్కే చిత్రాలు విపత్తు విధ్వంసానికి సంబంధించిన అనేక చిత్రాల మధ్య ప్రత్యేకంగా నిలుస్తాయి. మేజర్ సీతా అశోక్ షెల్కే, భారత సైన్యం ధైర్యసాహసాలు, అంకితభానికి సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
సంబంధిత కథనం