Shanghai Disneyland : కొవిడ్ భయంతో డిస్నీల్యాండ్ మూసివేత.. సందర్శకులంతా లోపలే!
Visitors Locked Inside Shanghai Disneyland : కొవిడ్ కలకలంతో చైనా షాంఘై డిస్నీల్యాండ్‌ను సోమవారం మూసివేశారు. లోపల అనేకమంది సందర్శకులు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. కొవిడ పరీక్షలు నిర్వహించిన తర్వాతే వారిని విడిచిపెడతారని సమాచారం.
Visitors Locked Inside Shanghai Disneyland : చైనా జీరో కొవిడ్ పాలసీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఈ పాలసీతో సొంత ప్రజలు అల్లాడిపోతున్నా కూడా చైనా పట్టించుకోవడం లేదు. తాజాగా ఇందుకు మరో ఉదాహరణ బయటకొచ్చింది. ఒక్క కేసు వెలుగులోకి వచ్చిందన్న కారణంగా.. షాంఘైలోని డిస్నీల్యాండ్‌ను పూర్తిగా మూసివేశారు. ఫలితంగా లోపల వందలాది మంది సందర్శకులు చిక్కుకున్నారు. వీరిని అక్కడి సిబ్బంది బయటకు పంపించడంలేదు!
ఏం జరిగిందంటే..
ఈ నెల 27న.. షాంఘైలోని డిస్నీల్యాండ్‌కు వెళ్లిన ఓ మహిళకు కొవిడ్ సోకినట్టు తేలింది. సోమవారం ఈ వార్త బయటకు రావడంతో.. ఉన్నపళంగా డిస్నీల్యాండ్‌ను మూసేశారు. లోపల ఉన్న వారిని బయటకు పంపలేదు. త్వరలో కొవిడ్ టెస్టులు చేస్తామని, అందులో నెగిటివ్ వచ్చిన వారు మాత్రమే బయటకు వెళ్లాలని సిబ్బంది తేల్చిచెప్పింది.
Shanghai Disneyland lockdown : ఇక ఈ నెల 27న డిస్నీల్యాండ్‌ను సందర్శించిన వారందరు కూడా పరీక్షలు చేయించుకోవాలని, నెగిటివ్ వచ్చినప్పటికీ ఇతరులకు కనీసం రెండు, మూడు రోజుల దూరంగా ఉండాలని షాంఘై అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
కొవిడ్ వేవ్‌లు, కఠిన నిబంధనల నేపథ్యంలో ఈ ఏడాది చైనా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అంతా సాఫీగా సాగిపోతోంది అనుకున్న సమయంలో ఆదివారం.. దేశవ్యాప్తంగా మళ్లీ భారీగా కొవిడ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఆగస్టు 10 తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. ఇక రంగంలోకి దిగిన అధికారులు.. మరోమారు కఠిన చర్యల అమలు చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో షాంఘై డిస్నీల్యాండ్ వ్యవహారం వార్తలకెక్కింది.
ఇది రెండోసారి..
Shanghai Disneyland news : కొవిడ్ కలకలంతో షాంఘైలోని డిస్నీల్యాండ్ మూతపడటం ఇది రెండోసారి. గతేడాది కూడా.. ఒకరికి పాజిటివ్ తేలిందన్న కారణంగా మొత్తం డిస్నీల్యాండ్నే మూసివేశారు. లోపల దాదాపు 34వేల మంది ఉండిపోయారు! వారందరికి పరీక్షలు చేసిన తర్వాతే సిబ్బంది బయటకు పంపారు. నెగిటివ్ వచ్చినా కూడా.. రెండు రోజుల పాటు అందరికి దూరంగా ఉండాలని ఆదేశించారు.
China covid cases : ఈ ఘటన జరిగిన తర్వాత కొన్ని నెలలకు షాంఘైలో విపరీతంగా కేసులు పెరిగాయి. కొవిడ్ కొత్త వేవ్‌తో నగరం అల్లాడిపోయింది. ఈ పరిస్థితుల నుంచి కోలుకుని 101 రోజుల తర్వాత డిస్నీల్యాండ్‌ను తిరిగి తెరిచారు. మళ్లీ ఇప్పుడు ఇలా జరగడంతో ఈసారి ఎన్ని రోజుల పాటు మూసివేస్తారు? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
తాజా పరిణామాలపై షాంఘై డిస్నీల్యాండ్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
సంబంధిత కథనం