‘యూపీఎస్సీ పరీక్ష కన్నా టఫ్​’- విశాల్​ మెగా మార్ట్​ సెక్యూరిటీ గార్డు జాబ్​పై మీమ్స్​ వైరల్!-vishal mega mart security guard job is the talk of the town see reason ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ‘యూపీఎస్సీ పరీక్ష కన్నా టఫ్​’- విశాల్​ మెగా మార్ట్​ సెక్యూరిటీ గార్డు జాబ్​పై మీమ్స్​ వైరల్!

‘యూపీఎస్సీ పరీక్ష కన్నా టఫ్​’- విశాల్​ మెగా మార్ట్​ సెక్యూరిటీ గార్డు జాబ్​పై మీమ్స్​ వైరల్!

Sharath Chitturi HT Telugu

విశాల్ మెగా మార్ట్ సెక్యూరిటీ గార్డు అన్నది ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ‘ఇక్కడ పనిచేయడం నా కల’ అంటూ మీమ్స్​ వెల్లువెత్తుతున్నాయి. దీనికి ఒక కారణం ఉంది. అసలేం జరిగిందంటే..

విశాల్​ మెగా మార్ట్​ సెక్యూరిటీ గార్డు జాబ్​

రిటైల్​ చెయిన్​ విశాల్​ మెగా మార్ట్​ గత కొన్ని గంటలుగా సోషల్​ మీడియాలో హాట్​ టాపిక్​గా మారింది! ‘విశాల్​ మెగా మార్ట్​లో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేయడం ఒక్కటే నా కల’, ‘విశాల్​ మెగా మార్ట్​ సెక్యూరిటీ గార్డు పోస్టుకు పరీక్ష.. యూపీఎస్సీ కన్నా టఫ్​,’ అంటూ నెటిజన్లు సోషల్​ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు. ఇందుకు ఒక కారణం కూడా ఉంది! అసలు విషయం ఏంటంటే..

విశాల్​ మెగా మార్ట్​ సెక్యూరిటీ గార్డు ఉద్యోగం..

విశాల్​ మెగా మార్ట్​ యూజమాన్యం ఇటీవలో తమ ఔట్​లెట్స్​లో సెక్యూరిటీ గార్డు పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించింది. ఒక ఇన్​స్టాగ్రామ్​ పోస్టు ప్రకారం.. ఈ పరీక్షలో కరెంట్​ అఫైర్స్​, ఇంగ్లీష్​, స్థానిక భాషపై ప్రశ్నలు అడిగారు. ఎంపిక ప్రక్రియలో భాగంగా మెడికల్ టెస్ట్, ఫిజికల్ ఫిట్​నెస్​ అసెస్మెంట్ కూడా చేశారు.

సెక్యూరిటీ, షూటింగ్ ట్రైనింగ్ లేదా మార్షల్ ఆర్ట్స్​లో ఎక్స్​పీరియెన్స్​ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇచ్చారు. పరీక్ష రాసేవారిలో మొదటి ఒక్క శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారని ఆ వైరల్ పోస్ట్ పేర్కొంది.

ఈ పోస్టు కొన్ని గంటల్లోనే సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. అప్పటి నుంచి విశాల్​ మెగా మార్ట్​ సెక్యూరిటీ గార్డు ఉద్యోగం అన్నది హాట్​టాపిక్​గా మారింది.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియను దేశంలోనే అత్యంత క్లిష్టమైన పరీక్షల్లో ఒకటిగా పేరొందిన యూపీఎస్సీ కన్నా విశాల మెగా మార్ట్​ సెక్యూరిటీ గార్డు టెస్ట్​ చాలా కఠినమైనదని పలువురు సెటైర్లు వేస్తున్నారు.

‘యాపిల్​ సీఈఓ వద్దు, అమెరికా ప్రెసిడెంట్​ జాబ్​ వద్దు.. విశాల్​ మెగా మార్ట్​లో సెక్యూరిటీ గార్డు జాబ్​ బెస్ట్​,’ అని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

మరి, సరదా అక్కడితో ఆగదు. కొన్ని మీమ్స్ లో విశాల్ మెగా మార్ట్ సెక్యూరిటీ గార్డు ఉద్యోగం పొందడం కష్టంగా ఉందని కూడా చూపించారు.

'ఒక్కటే కల- విశాల్ మెగా మార్ట్ సెక్యూరిటీ గార్డు ఉద్యోగం'

మీమ్స్​, జోక్స్​ అక్కడితో ఆగలేదు! విశాల్ మెగా మార్ట్ సెక్యూరిటీ గార్డు ఉద్యోగానికి సంబంధించిన వార్తలు వ్యాపించడంతో ఇంటర్నెట్ తన పని తాను చేసుకుపోయింది. పరిస్థితిపై సరదా మీమ్స్ తయారు చేసింది.

"ఏక్ హీ సప్నా (ఒకటే కల) - విశాల్ మెగా మార్ట్ సెక్యూరిటీ గార్డు", "విశాల్ మెగా మార్ట్ సెక్యూరిటీ గార్డు పరీక్ష మొదటి ప్రయత్నం విఫలమైంది," అంటూ ఇంకొకరు కామెంట్​ చేశారు.

ఈ పూర్తి టాపిక్​పై మీ ఒపీనియన్​ ఏంటి మరి?

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.