ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి- ట్రాక్​పై పడిపోయిన వ్యక్తి, దూసుకెళ్లిన రైలు..-viral video up man falls from bike while crossing railway track hit by train ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి- ట్రాక్​పై పడిపోయిన వ్యక్తి, దూసుకెళ్లిన రైలు..

ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి- ట్రాక్​పై పడిపోయిన వ్యక్తి, దూసుకెళ్లిన రైలు..

Sharath Chitturi HT Telugu

ఉత్తర్​ప్రదేశ్​లో ఓ వ్యక్తి బైక్​ మీద రైల్వే ట్రాక్​ దాడుతుండగా ట్రాక్​ మీదపడిపోయాడు. ఆ సమయంలోనే రైలు అతడి మీద నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్​గా మారింది.

వైరల్​ వీడియోలోని దృశ్యాలు..

ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్​, విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. రైల్వే ట్రాక్​ దాటుతుండగా ఓ వ్యక్తిని రైలు ఢీకొట్టింది! అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన ఒక భయానక వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

అసలేం జరిగిందంటే..

గ్రేటర్ నోయిడా ప్రాంతంలో ఆదివారం జరిగింది ఈ ఘటన. ఈ దుర్ఘటనకు సంబంధించి వైరల్​ అయిన వీడియోలో.. దాద్రీ ప్రాంతానికి చెందిన తుషార్ అనే యువకుడు తన బైక్‌పై రైల్వే ట్రాక్ దాటేందుకు ప్రయత్నించడం కనిపిస్తోంది. అయితే, ట్రాక్ దాటుతుండగా అతడి ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోయింది. అతను కూడా కింద పడిపోయాడు.

అందిన సమాచారం ప్రకారం, రైల్వే క్రాసింగ్ గేట్ మూసివేసి ఉన్నప్పటికీ తుషార్ దానిని దాటేందుకు ప్రయత్నించాడు. బైక్ పడిపోవడంతో, దాన్ని తీయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో, రైలు దగ్గరికి వస్తున్న విషయాన్ని గమనించి పరుగెత్తడానికి ప్రయత్నించాడు. కానీ, అతడు పరుగెత్తడానికి ప్రయత్నించిన సెకన్లలోనే రైలు వేగంగా వచ్చి ఢీకొట్టింది. భయంతో, రైల్వే ట్రాక్​ పక్కకు కాకుండా.. రైల్వే ట్రాక్​ మీదే పరిగెత్తడంతో ఈ ఘటన జరిగింది.

తుషార్​ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

ఈ వీడియోని చూసిన వారందరు షాక్​ అవుతున్నారు! ప్రాణం క్షణాల్లో పోతుందని, జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత అందరి మీద ఉందని కామెంట్లు పెడుతున్నారు.

సోషల్​ మీడియాలో వైరల్​గా మారిన వీడియోని ఇక్కడ చూడండి :

యూపీలో అత్యధిక రైల్వే ప్రమాదాలు: రికార్డులు ఏం చెబుతున్నాయి?

తాజాగా విడుదలైన జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్​సీఆర్​బీ) నివేదిక ప్రకారం.. 2023 సంవత్సరంలో దేశంలో అత్యధిక రైల్వే క్రాసింగ్ ప్రమాదాలు నమోదైన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలిచింది!

2023లో దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం 2,483 రైల్వే ప్రమాద కేసుల్లో ఉత్తరప్రదేశ్‌లోనే 1,025 కేసులు ఉన్నాయి.

అలాగే, రైల్వే క్రాసింగ్ ప్రమాదాల్లో సంభవించిన మరణాల సంఖ్యలో కూడా ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది! దేశంలో నమోదైన మొత్తం 2,242 మరణాల్లో, 1,007 మరణాలు ఒక్క యూపీలోనే సంభవించాయి!

ఈ ప్రమాదాలు రైల్వే ట్రాక్‌ల వద్ద ప్రజలు పాటించాల్సిన భద్రత, జాగ్రత్తలపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.