జలపాతంలో భారీ సంఖ్యలో టూరిస్ట్​లు- ఇంతలో బుసలు కొట్టిన పాము! ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి..-viral video snake slithers into tourist packed waterfall triggering panic and chaos ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  జలపాతంలో భారీ సంఖ్యలో టూరిస్ట్​లు- ఇంతలో బుసలు కొట్టిన పాము! ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి..

జలపాతంలో భారీ సంఖ్యలో టూరిస్ట్​లు- ఇంతలో బుసలు కొట్టిన పాము! ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి..

Sharath Chitturi HT Telugu

జలపాతంలో మీరు హాయిగా గడుపుతున్నప్పుడు, ఒక్కసారిగా పాము మీ మీదకు దూసుకొస్తే? వింటనే భయంగా ఉంది కదూ! కానీ ఉత్తరాఖండ్​లో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. వీడియో వైరల్​గా మారింది.

వైరల్​ వీడియోలోని ఒక దృశ్యం! (Instagram/@littledehradunstories)

జలపాతంలోకి దూరిన ఒక పాము, టూరిస్ట్​లను దడదడలాడించిన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్​ మీడియాలో వైర్​గా మారింది. ఆ వీడియో చాలా భయానకంగా ఉండటంతో, ఆ దృశ్యాలు చూసిన వారందరు షాక్​ అవుతున్నారు. అసలు ఏం జరిగిందంటే..

ఇదీ జరిగింది..

ఉత్తరాఖండ్​ ముస్సోరిలోని కెమ్టీ జలపాతం వద్ద జరిగినట్లు చెబుతున్న ఒక విచిత్రమైన, భయానక సంఘటన కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ప్రకారం.. సరదాగా సాగుతున్న విహారయాత్ర ఒక్కసారిగా గందరగోళంగా మారింది! పర్యాటకులతో కిక్కిరిసి ఉన్న నీటిలో అనూహ్యంగా ఒక పాము కనిపించింది, నీటిలో వేగంగా కదిలింది. దాన్ని చూసిన టూరిస్ట్​లు బెంబేలెత్తిపోయారు. గజగజ ఒణికిపోయి, ప్రాణ భయంతో పరుగులు తీశారు.

వైరల్ అవుతున్న ఆ వీడియో క్లిప్‌లో, డజన్ల కొద్దీ పర్యాటకులు సుందరమైన జలపాతాన్ని ఆస్వాదిస్తుండగా, ఒక్కసారిగా కలకలం రేగినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. పాము కనిపించగానే ప్రజలు భయంతో కేకలు వేస్తూ, నీటిలో నుంచి బయటకు రావడానికి పరుగులు తీయడం ఆ వైరల్​ వీడియోలో చూడవచ్చు.

పర్యాటకులతో నిండిన నీటిలో పాము వేగంగా కదులుతూ ఉంది. కెమెరా జూమ్ ఔట్ చేయగా, దృశ్యం మరింత గందరగోళంగా మారింది. డజన్ల కొద్దీ ప్రజలు భయంతో వెనక్కి వెళుతూ, తమని తాము రక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ వీడియోను '@littledehradunstories' అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ పోస్ట్ చేసింది. "ముస్సోరిలోని కెమ్టీ జలపాతం వద్ద స్నానం చేస్తున్న పర్యాటకుల మధ్య పాము ప్రవేశించింది. ఎంత గందరగోళం జరిగిందో చూడండి!" అనే క్యాప్షన్‌తో ఈ వీడియో షేర్ అయింది.

సోషల్​ మీడియాలో వైరల్​గా మారిన వీడియోని ఇక్కడ చూడండి. :

ఈ వీడియో ఇన్​స్టెంట్​గా వైరల్​ అయ్యింది. ఈ ఘటనపై చాలామంది ఆన్‌లైన్ వీక్షకులు ఆందోళన వ్యక్తం చేయగా, వ్యాఖ్యల విభాగం మాత్రం హాస్యభరితమైన కామెంట్లతో నిండిపోయింది. ఒక యూజర్, '@dhiraj_chhabra__', "ఇంతమంది మధ్యలోకి ఇంకొకడు వచ్చాడు" అని చమత్కరించారు.

మరొక యూజర్ '@sparsh_k_kumar' అధిక రద్దీపై వ్యంగ్యంగా స్పందిస్తూ, "ఇంకా రండి, వీళ్లు మొత్తం ట్రాఫిక్ పెట్టేశారు, మ్యాగీ పాయింట్‌కి వెళ్లడం కూడా కష్టంగా ఉంది.. ఇకపై రావద్దు," అని రాశారు.

ఈ వైరల్​ వీడియోపై మీ కామెంట్స్​ ఏంటి?

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.