Viral video : ‘ఈమె ధర రూ. 150, ఆమె రేటు రూ. 300’- అంటూ టూరిస్ట్​లను వేధించిన వ్యక్తి అరెస్ట్​!-viral video shows jaipur man giving price tags to women tourists he gets detained ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Viral Video : ‘ఈమె ధర రూ. 150, ఆమె రేటు రూ. 300’- అంటూ టూరిస్ట్​లను వేధించిన వ్యక్తి అరెస్ట్​!

Viral video : ‘ఈమె ధర రూ. 150, ఆమె రేటు రూ. 300’- అంటూ టూరిస్ట్​లను వేధించిన వ్యక్తి అరెస్ట్​!

Sharath Chitturi HT Telugu
Jun 24, 2024 05:20 PM IST

Jaipur viral video : జైపూర్​లో ఓ వ్యక్తి పలువురు వీదేశీ టూరిస్ట్​లను వేధించాడు. దేశానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా అసభ్యకరంగా ప్రవర్తించాడు!

టూరిస్ట్​లను వేధించిన వ్యక్తి అరెస్ట్​..
టూరిస్ట్​లను వేధించిన వ్యక్తి అరెస్ట్​..

Jaipur viral video : 'అతిథి దేవో భవ' అంటూ ప్రపంచానికి స్ఫూర్తిగా నిలుస్తున్న భారత దేశ పరువును తీసే విధంగా ఓ వ్యక్తి ప్రవర్తించాడు. విదేశీ టూరిస్ట్​ల 'రేటు' ఇది అంటూ ఓ వీడియో చేశాడు! ఆ వీడియో వైరల్​ అయ్యింది. చివరికి పోలీసులు అతడిని అరెస్ట్​ చేశారు.

వైరల్​ వీడియోలో ఏముందంటే..

జైపూర్​లో జరిగింది ఈ ఘటన. వైరల్​ వీడియోలో ఓ వ్యక్తి కనిపించాడు. అతను హిందీలో మాట్లాడటం మొదలుపెట్టాడు. అక్కడే ఉన్న విదేశీ టూరిస్ట్​ల దగ్గరకు వెళ్లాడు. "ఈమె ధర రూ. 150, ఆమె రేటు రూ. 200. ఈమెను రూ. 500కు తీసుకోవచ్చు. ఆమె రేటు రూ. 300" అంటూ మాట్లాడాడు ఆ వ్యక్తి. అతని మాటలు అర్థం కాక.. మహిళా టూరిస్ట్​లు నవ్వుతూ, చేతులు ఊపుతూ మాట్లాడారు.

ఇదంతా.. ఆ వ్యక్తి ఇన్​స్టాగ్రామ్​లో లైవ్​ చేసినట్టు తెలుస్తోంది. ఆ వీడియో వెంటనే సోషల్​ మీడియాలో వైరల్​ మారింది. నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

Amer fort viral video : "ఇలాంటి వారి వల్లే విదేశీయులకు ఇండియాలో చేదు జ్ఞాపకాలు ఎదురవుతున్నాయి. టూరిస్ట్​లను వేధిస్తున్నందుకు.. పోలీసులు ఇతడిని అరెస్ట్​ చేయాలి. కాస్త జ్ఞానం నేర్పించాలి. అతిథి దేవో భవకు అర్థం నేర్పించాలి," అని ఓ నెటిజన్​ వ్యాఖ్యానించారు.

“ఈ వ్యక్తి.. టూరిస్ట్​లను వేధించడం ఇది మొదటిసారి కాదు. ఇతడు టూరిస్ట్​లను వేధించడం జైపూర్​లో ఉండే నా ఫ్రెండ్​ చాలాసార్లు చూసింది. అమేర్​ ఫోర్ట్​కి గైడ్​ ఇతను. అమేర్​, జైగఢ్​లో తిరుగుతుంటాడు. ఫోర్ట్​లో అసభ్యకర ప్రవర్తనతో ఇప్పటికే ఒకసారి తన్నులు తిన్నాడు. కానీ అది సరిపోయినట్టు లేదు. ఇప్పుడు జైలుకు పంపించాలనుకుంటా,” అని మరో నెటిజన్​ పేర్కొన్నారు.

Jaipur man price tag video : "ఇలాంటి వారిని విడిచిపెట్టకూడదు," అని మరొకరు కామెంట్​ చేశారు. "అసలేంటిది? ఎందుకిలా చేస్తున్నారు?" అని మరొకరు అసహనం వ్యక్తం చేశారు.

వీడియో పోలీసుల దృష్టికి వెళ్లింది. దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు.. సదరు వ్యక్తిని ఆదివారం అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టినట్టు వివరించారు.

దర్యాప్తులో భాగంగా.. అతని పేరు గురు అని తేలింది. అతను.. విదేశీయులను బలంవంతం చేసి, వారి చేత తన దుకాణంలో వస్తువులు కొనుగోలు చేసేలా చేశాడని సమాచారం.

దేశాన్ని నెంబర్​.1 స్థాయికి తీసుకెళ్లేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటే.. కొందరు మాత్రం, తమ అసభ్యకర ప్రవర్తనతో ఇలా పరువు తీస్తున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి వారి వల్ల ఏమాత్రం ఉపయోగం లేదని అంటున్నారు. వీరికి తగిన విధంగా బుద్ధి చెప్పాలని డిమాండ్​ చేస్తున్నారు.

సోషల్​ మీడియాలో వైరల్​ అయిన వీడియోను ఇక్కడ చూడండి..

WhatsApp channel

సంబంధిత కథనం