Noida viral video : జాకెట్ ‘ఎక్స్ఛేంజ్’కు ఒప్పుకోలేదని.. దుకాణదారుడిపై దాడి!
Noida crime news : కొన్న వస్తువు ఎక్స్ఛేంజ్కు ఒప్పుకోలేదన్న కారణంతో దుకాణదారుడిపై ఇద్దరు దాడి చేసిన ఘటన నోయిడాలో చోటుచేసుకుంది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
Noida crime news : నోయిడాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. జాకెట్ ఎక్స్ఛేంజ్కు ఒప్పుకోలేదన్న కారణంతో.. ఓ దుకాణదారుడిపై కర్రతో దాడి చేశారు ఇద్దరు వ్యక్తులు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
అసలేం జరిగిందంటే..
ఓ మహిళ.. నోయిడా మార్కెట్లోని ఓ దుకాణం నుంచి కొన్ని రోజుల క్రింత ఓ జాకెట్ కొనుగోలు చేసింది. దానిని రిటర్న్ ఇచ్చేందుకు గురువారం ఆ దుకాణానికి వెళ్లింది. ఎక్స్ఛేంజ్ చేసేందుకు దుకాణదారుడు అంగీకరించలేదు. వెంటనే ఆ మహిళ.. ఆమె భర్తకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది.
Attack on Noida shopkeeper : మహిళ భర్త.. మరో వ్యక్తితో పాటు దుకాణం వద్దకు వచ్చాడు. ఇద్దరు కలిసి రెండు కర్రలతో దుకాణ యజమానిని కొట్టడం మొదలుపెట్టారు. ఈ దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాకు చిక్కాయి.
తొలుత.. దుకాణ యజమాని కస్టమర్లతో మాట్లాడుతున్నట్టు ఆ వీడియోలో కనిపిస్తోంది. సడెన్‌గా ఓ వ్యక్తి అతనిపై కర్రతో దాడి చేశాడు! ఇతను ప్రతిఘటించినా ఫలితం దక్కలేదు. కర్రతో బలంగా కొట్టడం మొదలుపెట్టారు. ఓ సందర్భంలో కర్ర కూడా విరిగిపోయింది! ఈ పరిణామాలతో కస్టమర్లు షాక్‌కు గురయ్యారు.
Noida crime news : మరో వ్యక్తి కూడా దుకాణదారుడిని కొట్టడం మొదలుపెట్టాడు. కొద్దిసేపటికి.. మరో వ్యక్తి వచ్చి.. దాడి చేస్తున్న ఇద్దరిని అడ్డుకుని నచ్చజెప్పినట్టు వీడియోలో కనిపిస్తోంది.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. నిందితులపై కేసు నమోదు చేసుకున్నారు. నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. మరొకరిని పట్టుకునే పనిలో ఉన్నారు. మరోవైపు బాధితుడికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. అతడిని ఆసుపత్రికి తరలించారు.
"బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించాము. మెడికల్ రిపోర్టు, సీసీటీవీ ఫుటేజ్‌లను సాక్షాలుగా పనికొస్తాయి. ఒక నిందితుడిని అరెస్ట్ చేశాము," అని నోయిడా ఏడీసీపీ ఆషుతోష్ ద్వివేది వెల్లడించారు.
సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన దృశ్యాలను ఇక్కడ చూడండి :
సంబంధిత కథనం