మహిళపైకి దూసుకెళ్లిన కారు.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు-viral video of woman rider run over after being hit by door of parked car ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  మహిళపైకి దూసుకెళ్లిన కారు.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు

మహిళపైకి దూసుకెళ్లిన కారు.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు

Sharath Chitturi HT Telugu

Bengaluru viral video : బెంగళూరులో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. ఆగి ఉన్న కారు డోర్​ను లోపలి వ్యక్తి సడెన్​గా తీశారు. అటుగా వెళుతున్న బండిపైన మహిళ.. కారు డోర్​ తగిలి కిందపడిపోయింది. ఆ వెంటనే.. ఆమెపైకి మరో కారు దూసుకెళ్లింది.

సీసీటీవీ కెమెరాకు చిక్కిన ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు

Bengaluru viral video : జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అంచనా వేయడం చాలా కష్టం. అప్పటి వరకు కష్టాలు లేకుండా జీవిస్తున్న మనిషి జీవితం.. క్షణాల్లో తలకిందులు అయిపోవచ్చు! ఇలాంటి ఘటనే ఒకటి బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి చేసిన పొరపాటు కారణంగా ఓ మహిళపై ఓ కారు దూసుకెళ్లింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

కర్ణాటక స్టేట్​ రోడ్​ సెఫ్టీ అథారిటీ.. ఈ వీడియోను ట్వీట్​ చేసింది. వీడియోలో.. తొలుత ఓ కారు ఆగి ఉంది. అటుగా ఒక మహిళ బండి మీద వెళుతోంది. అది గమనించకుండా.. కారు లోపల ఉన్న వ్యక్తి.. ఫ్రంట్​ డోర్​ తీశారు. అంతే! ఆ డోర్​.. ఆ మహిళకు తగిలింది. ఆ మహిళ వెంటనే కిందపడిపోయింది.

అదే సమయంలో వెనక నుంచి మరో కారు వచ్చింది. ఆ కారు, ఆ మహిళ మీద నుంచి దూసుకెళ్లి, సడెన్​గా ఆగిపోయింది. ఈ దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. వీడియో చివరలో.. మహిళవైపు స్థానికులు పరిగెడుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి.

"రోడ్డు మీద కారు డోర్​ ఓపెన్​ చేసే సమయంలో రేర్​ వ్యూ మిర్రర్​ను చూడటం మర్చిపోకూడదు. లేకపోతే వెనకాల నుంచి వచ్చే వాహనాలకు ప్రమాదం జరుగుతుంది," అని ట్వీట్​కి క్యాప్షన్​ ఇచ్చింది కర్ణాటక స్టేట్​ రోడ్​ సెఫ్టీ అథారిటీ.

ఈ ఘటన సెప్టెంబర్​ 24న జరిగినట్టు తెలుస్తోంది. ఈ వీడియోకు 48,500కిపైగా వ్యూస్​ వచ్చాయి. చూసిన వారందరు షాక్​కు గురవుతున్నారు.

ఘటనలో మహిళకు గాయాలయ్యాయా? ఆమె ప్రస్తుత పరిస్థితేంటి? అన్న వివరాలు తెలియరాలేదు. కారు ఓనర్​పై పోలీసులు ఏమైనా చర్యలు తీసుకున్నారా? అన్న ప్రశ్నకు స్పష్టత లభించలేదు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన దృశ్యాలను ఇక్కడ చూడండి:

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.