Viral video : ఇదేందయ్యా ఇది.. వామ్మో! ఇది కొత్తగా వేసినా రోడ్డా?
Viral video : మహారాష్ట్రలోని ఓ రోడ్డును.. స్థానికులు చేతితో పైకి లేపిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఫలితంగా అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Maharashtra road Viral video : దేశంలో అధికారుల నిర్లక్ష్యం, రోడ్ల దుస్థితికి అద్దం పట్టే మరో ఘటన ఇది! ఏదో.. నేల మీద పడి ఉన్న కార్పెట్‌ను పైకి లేపుతున్నంత సులభంగా.. కొందరు ప్రజలు రోడ్డును లేపేశారు. పైగా.. అది కొత్తగా వేసిన రోడ్డు కావడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ట్రెండింగ్ వార్తలు
అసలు ఏం జరిగింది..?
సంబంధిత వీడియో.. మహారాష్ట్రకు చెందినదిగా నెటిజన్లు చెబుతున్నారు. వీడియోలో కొందరు మనుషులు ఉన్నారు. కొత్తగా వేసిన రోడ్డు వద్ద నిలబడ్డారు. అనంతరం రోడ్డు కింద వేసిన కార్పెట్ లాంటి మెటీరియల్‌ను చేతులతో ఎత్తి పైకి లేపి పట్టున్నారు! ఆ తర్వాత అధికారులపై మండిపడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంట్రాక్టర్ పేరు రానా థాకూర్ అని చెబుతూ.. కొత్త రోడ్డు ఒక బోగస్ అని ఆరోపించారు.
పలు మీడియా కథనాల ప్రకారం.. ఈ ఘటన మహారాష్ట్రలోని జల్నా జిల్లా అంబాద్ తాలూకా కజ్రత్- హస్త్ పోఖరి ప్రాంతంలో జరిగింది. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద ఇటీవలే ఈ రోడ్డును నిర్మించారు. వాస్తవానికి ఈ రోడ్డును జర్మన్ టెక్నాలజీతో రూపొందించినట్టు కాంట్రాక్టర్ చెప్పాడు. కానీ గ్రామస్థులు సందేహం నిజమైంది. కార్పెంట్ లాంటి మెటీరియల్‌తో రోడ్డును వేసినట్టు ఆరోపిస్తున్నారు.
ఈ వ్యవహారంపై స్థానికులు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. రోడ్డు నిర్మాణంలో పాలుపంచుకున్న అధికారులందరినీ శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ వీడియో చూసి పలువురు నెటిజన్లు షాక్ అవుతుంటే.. మరికొందరు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. 'ఇలా ఉన్నారేంట్రా మీరు..' అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన దృశ్యాలు ఇక్కడ చూడండి.
కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ.. దేశంలో కనెక్టివిటీని పెంచేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నారు. రోడ్డు వ్యవస్థను మెరుగుపరిచి, నిర్మాణం శరవేగంగా సాగే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఇలాంటి సమయంలో.. రోడ్డు నిర్మాణంలో అధికారుల నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి.
భారత రోడ్డు వ్యవస్థ..
Maharashtra road latest news : మేక్ ఇన్ ఇండియా వెబ్సైట్ ప్రకారం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రోడ్డు వ్యవస్థ కలిగిన దేశం ఇండియా. 63.32 లక్షల కిలోమీటర్ల మేర రోడ్డు వ్యవస్థ విస్తరించి ఉంది. కేంద్ర రోడ్డు మంత్రిత్వ శాఖతో పాటు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్, నేషనల్ హైవే అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, ఇండియన్ అకాడమీ ఆఫ్ హైవే ఇంజినీర్స్ వంటి సంస్థలు.. దేశంలో రోడ్డు నిర్మాణ కార్యకలాపాలు చేపడుతున్నాయి.
సంబంధిత కథనం