Viral | మృత్యువు అంచు వరకు వెళ్లిన బాలుడు.. ఒళ్లుగగుర్పొడిచే దృశ్యాలు..!-viral video of a boy saved from bus accident ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Viral | మృత్యువు అంచు వరకు వెళ్లిన బాలుడు.. ఒళ్లుగగుర్పొడిచే దృశ్యాలు..!

Viral | మృత్యువు అంచు వరకు వెళ్లిన బాలుడు.. ఒళ్లుగగుర్పొడిచే దృశ్యాలు..!

HT Telugu Desk HT Telugu
Mar 25, 2022 05:27 PM IST

ఓ బాలుడు తృటిలో మృత్యువు నుంచి బయటపడ్డాడు. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

<p>ఒళ్లుగగుర్పొడిచే దృశ్యాలు..</p>
<p>ఒళ్లుగగుర్పొడిచే దృశ్యాలు..</p> (TWITTER)

Boy saved from bus accident | రాసిపెట్టి ఉంటే.. చిన్న సూది గుచ్చుకున్నా మరణిస్తారు.. అదృష్టం ఉంటే ఎంతటి దారుణం జరిగినా బతికి బయటపడతారు. ఓ 9ఏళ్ల బాలుడి పరిస్థితిని చూస్తే ఇదే అనిపిస్తుంది! సైకిల్​ మీద వెళ్లిన ఓ బాలుడు.. దాదాపు బస్సు కింద పడినంత పనైంది. చివరికి సురక్షితంగా బయటపడ్డాడు.

కేరళ కన్నూర్​లోని తలిపరంబ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ బాలుడు.. సైకిల్​ మీద కాస్త వేగంగా రోడ్డు మీదక వెళ్లాడు. అటుగా వెళుతున్న బైక్​ అతడిని ఢీకొట్టింది. దీంతో బాలుడు సైకిల్​పై పట్టు కోల్పోయాడు. గాలిలో ఒక్కసారిగా ఎగిరాడు. అదే సమయానికి ఓ బస్సు అక్కడి నుంచి వేగంగా దూసుకెళ్లింది. బాలుడు సైకిల్​ మీద నుంచి కిందపడిపోయాడు. బస్సు కింద సైకిల్​ చితికిపోయింది. బాలుడు మాత్రం అదృష్టవశాత్తు బస్సు టైర్లకు కొంచెం దూరంలో పడ్డాడు. ఒళ్లుగగుర్పొడిచే ఈ దృశ్యాలు.. స్థానికి సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. అంతా క్షణాల్లోనే జరిగిపోయింది.

ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. 'బాలుడు చాలా లక్కీ. ఈరోజు గొప్ప పాఠం నేర్చుకుని ఉంటాడు,' అని ఓ నెటిజన్​ కామెంట్​ చేశాడు. మరికొందరు.. బాలుడు బతికి బయటపడటంతో దేవుడికి ధన్యవాదాలు చెబుతున్నారు.

ఇక్కడ వేగంగా వెళ్లడం బాలుడి తప్పు. ముందూవెనకా చూసుకోకుండా బైక్​ నడిపిన వ్యక్తి తప్పు కూడా ఉంది. ఇక చివర్లో.. వేగంగా దూసుకొచ్చిన బస్సు డ్రైవర్​ తప్పు ఉంది. ఏం జరగలేదు కాబట్టి సరిపోయింది! లేకపోతే..? అందుకే ట్రాఫిక్​ నియమాలను పాటించి, వేగాన్ని నియంత్రించుకుంటే అందరికి మంచి జరుగుతుందన్న విషయాన్ని కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి.

వైరల్​ వీడియోను ఇక్కడ చూడండి:

సంబంధిత కథనం

టాపిక్