Rashtrapati Bhavan : రాష్ట్రపతి భవన్లో చిరుత.. ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు!
సోషల్ మీడియాలో ఇప్పుడొక వీడియో వైరల్ అవుతోంది. అది చూసినవారందరూ.. ‘రాష్ట్రపతి భవన్లో చిరుత తిరుగుతోంది’ అంటున్నారు.

Leopard in swearing in ceremony : ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకార మహోత్సవం.. ఆదివారం సాయంత్రం దిల్లీ రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా సాగింది. అయితే.. మోదీ కేబినెట్లో మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు వార్తల్లకెక్కింది. రాష్ట్రపతి భవన్లో చిరుత సంచరిస్తోందంటూ.. ఆ వీడియో చూసిన వారందరు కామెంట్స్ చేస్తున్నారు.
రాష్ట్రపతి భవన్లో చిరుత సంచారం..!
వైరల్ వీడియోలో బీజేపీ ఎంపి దుర్గాదాస్ ఉయికే సహాయ మంత్రి పదవిని చేపట్టడానికి కాగితాలపై సంతకం చేస్తూ కనిపించారు. ఆ వెంటనే.. కెమెరా కాస్త పైకి, రాష్ట్రపతి భవన్‌వైపు కదిలింది. ఆ సమయంలో ఒక షాడో కదులుతూ కనిపించింది. దానికి నాలుగు కాళ్లు ఉన్నాయి. అచ్చు చిరుతలాగే అది కదిలింది. అందుకే.. ఇది చిరుతపులి అని కొందరు అంటున్నారు.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో ఇక్కడ చూడండి :
leopard in swearing in ceremony viral video : “అది చిరుతపులే!” అని ఒకరు కామెంట్ చేశారు. “ఇది నిజమైన వీడియోనే అయితే.. అది పిల్లి అయ్యుండొచ్చు. చిరుత కాదు!” అని ఇంకొందరు పేర్కొన్నారు. “అది సెక్యూరిటీ డాగ్- జర్మన్ షెపర్డ్ అయ్యుండొచ్చు,” అని మరొకరు అన్నారు. “చూస్తుంటే ఒక కుక్కలాగా ఉంది. కానీ నడక మాత్రం క్యాట్ ఫ్యామిలీలా ఉంది,” అని ఇంకొకరు అభిప్రాయపడ్డారు.
మోదీ ప్రమాణస్వీకార వేడుక..
మోదీ 3.0 ప్రమాణ స్వీకారోత్సవానికి జాతీయ, అంతర్జాతీయ ప్రముఖుల సమక్షంలో భారీ సంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. మోదీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడు పర్యాయాలు ప్రధానిగా గెలిచిన ఏకైక ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించారు.
మోదీ కేబినెట్లో.. అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్ సహా 30 మంది కేబినెట్ మంత్రులు ఉన్నారు. 30 మంది కేబినెట్ మంత్రులతో పాటు ఐదుగురు స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులు, 36 మంది సహాయ మంత్రులు ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు.
మోదీ తొలి సంతకం..
Leopard in swearing in ceremony news : మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం.. సోమవారం ఉదయం తన పనిని ప్రారంభించారు నరేంద్ర మోదీ. ఇందులో భాగంగా.. పీఎం కిసాన్ నిధి 17వ విడత విడుదలకు సంబంధించిన ఫైల్‌పై తొలి సంతకం చేశారు. ఈ పథకం కింద.. 9.3 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని, సుమారు రూ .20,000 కోట్లు పంపిణీ చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.
"రైతన్న అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉన్న ప్రభుత్వం మాది. అందుకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం.. రైతు సంక్షేమానికి సంబంధించిన ఫైల్‌పై తొలి సంతకం చేశాను. రాబోయే కాలంలో రైతులు, వ్యవసాయ రంగం కోసం మరింత కృషి చేయాలనుకుంటున్నాము,' అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం