Viral : ఫుల్​గా తాగేసి ఎయిర్​పోర్ట్​లో రచ్చ.. అతని దెబ్బకు గర్ల్​ఫ్రెండ్​ హడల్​!-viral video intoxicated passenger punches airport staff ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Viral Video : Intoxicated Passenger Punches Airport Staff

Viral : ఫుల్​గా తాగేసి ఎయిర్​పోర్ట్​లో రచ్చ.. అతని దెబ్బకు గర్ల్​ఫ్రెండ్​ హడల్​!

Sharath Chitturi HT Telugu
Jun 27, 2022 05:05 PM IST

viral video : ఆ జంట ఫుల్​గా తాగేసి విమానాశ్రయానికి వెళ్లింది. కానీ అక్కడి సిబ్బంది వారిని విమానం ఎక్కకుండా అడ్డుకుంది. బాయ్​ఫ్రెండ్​కు కోపం వచ్చింది. సిబ్బందిపై దాడి చేశాడు. ఈ ఘటన ఇంగ్లాండ్​లో జరిగింది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ఫుల్​గా తాగేసి ఎయిర్​పోర్ట్​లో రచ్చ.. అతని దెబ్బకు గర్ల్​ఫ్రెండ్​ హడల్​
ఫుల్​గా తాగేసి ఎయిర్​పోర్ట్​లో రచ్చ.. అతని దెబ్బకు గర్ల్​ఫ్రెండ్​ హడల్​ (Youtube)

viral video : మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి.. విమానాశ్రయంలో రచ్చరచ్చ చేశాడు. తన గర్ల్​ఫ్రెండ్​ను పక్కకి నెట్టేసి, విమానాశ్రయం సిబ్బందిపై దాడికి దిగాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ట్రెండింగ్ వార్తలు

ఈ వైరల్​ వీడియోకు సంబంధించిన ఘటన ఇంగ్లాండ్​లోని బ్రిస్టోల్​ విమానాశ్రయంలో జరిగింది. సంబంధిత వ్యక్తులు.. బ్రిస్టోల్​ నుంచి ఈజీజెట్​ విమానంలో స్పెయిన్​లోని అలికాంటే ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. కానీ ఆ జంట అప్పటికే ఫుల్​గా తాగేసి మద్యం మత్తులో విమానాశ్రయానికి వెళ్లింది. వారి పరిస్థితిని చూసి, ఎయిర్​పోర్టు సిబ్బంది వారిని అడ్డుకుంది. విమానంలోకి ప్రవేశించేందుకు అనుమతి నిరాకరించింది. ఫలితంగా ఆ జంటకు కోపం వచ్చింది. సిబ్బందిని తిట్టడం మొదలుపెట్టారు బాయ్​ఫ్రెండ్​- గర్ల్​ఫ్రెండ్​.

వైరల్​ వీడియోలో అక్కడి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గర్ల్​ఫ్రెండ్​ వెనక ఓ వ్యక్తి నిలబడ్డాడు. వారిద్దరు సిబ్బందిని తిడుతున్నారు. ఇంతలో ఆ వ్యక్తి.. తన గర్లఫ్రెండ్​ను పక్కకు నెట్టేసి, ముందుకెళ్లాడు. ఆమె పక్కకు పడిపోయింది. ఈ క్రమంలోనే సిబ్బందిపై దాడికి దిగాడు. సిబ్బందిలోని వ్యక్తి చెంప చెళ్లుమనే విధంగా కొట్టాడు.

అక్కడే ఉన్న ఇతర సిబ్బంది, ప్రయాణికులు పరిస్థితిని అదుపుచేసేందుకు ప్రయత్నించారు.

"మమ్మల్ని మీరు ఎలా ఆపుతారు? విమానం ఎక్కనివ్వరా? అని వాళ్లిద్దరు ఎయిర్​పోర్టు సిబ్బందిని ప్రశ్నించారు. వాళ్లు ఏడిచారు కూడా," అని అక్కడే ఉన్న మరో ప్రయాణికుడు చెప్పారు.

వైరల్​ వీడియోపై స్పందించిన పోలీసులు.. ఘటన జరిగిన అనంతరం ఆ జంటను అరెస్ట్​ చేశారు. భౌతిక దాడి చేశారని ఆరోపణలు మోపారు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన వీడియోను ఇక్కడ చూడండి:

IPL_Entry_Point

సంబంధిత కథనం