Ex Intelligence officer murdered : మాజీ ఐబీ అధికారిపైకి కారు ఎక్కించి హత్య..!
Ex Intelligence officer murdered : కర్ణాటకలో మాజీ ఐబీ అధికారి ఆర్కే కులకర్ని దారుణ హత్యకు గురయ్యారు! ఓ కారు ఆయనపైకి దూసుకెళ్లింది. తొలుత ఇది హిట్ అండ్ రన్ కేసుగా భావించారు పోలీసులు. కానీ సీసీటీవీ ఫుటేజీ చూసిన తర్వాత.. పక్కా ప్రణాళికతో హత్య చేశారని తేలింది.
Ex Intelligence officer murdered : కర్ణాటక మైసూరులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మాజీ నిఘా అధికారిపైకి కారు ఎక్కించి హత్య చేశాడు ఓ దుండగుడు. ఈ వార్త రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది.
ట్రెండింగ్ వార్తలు
షాకింగ్ దృశ్యాలు..
ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ అధికారి ఆర్కే కులకర్ని.. మైసూరు వర్సిటీకి చెందిన మానసగంగోత్రి క్యాంపస్‌లో శుక్రవారం సాయంత్రం వాకింగ్‌కి వెళ్లారు. కొద్దిసేపటికి ఓ కారు ఆయన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో కులకర్ని ప్రాణాలు కోల్పోయారు.
తొలుత ఈ ఘటనను హిట్ అండ్ రన్ కేసుగా భావించారు పోలీసులు. కానీ దర్యాప్తులో భాగంగా షాకింగ్ నిజాలు బయటకొచ్చాయి.
దర్యాప్తు కోసం స్థానిక సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఓ కారు కులకర్నిని ఢీకొట్టిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ దృశ్యాలు చూస్తే.. ఆ కారు కావాలనే మాజీ ఐబీ అధికారిని ఢీకొట్టినట్టు స్పష్టంగా తెలుస్తోంది.
Ex Intelligence officer murdered in Karnataka : కులకర్ని.. రోడ్డు పక్కకు నడుస్తుండటం, రోడ్డు మీద వెళుతున్న ఆ కారు, ఒక్కసారిగా ఆయనపైకి దూసుకెళ్లడం ఆ దృశ్యాల్లో కనిపిస్తోంది. ఆ వెంటనే ఆ కారు ఘటనాస్థలం నుంచి వెళ్లిపోయింది. ఆ కారుకు నెంబర్ ప్లేట్ కూడా లేకపోవడం గమనార్హం.
పక్కా ప్లాన్‌తో..!
"ఆ రోడ్డు చాలా చిన్నగా ఉంటుంది. సాధారణంగా కార్లు ఈ ప్రాంతంలో వెళ్లవు. నిందితుడు.. కులకర్నిని ఫాలో చేసినట్టు కనిపిస్తోంది. ఇది పక్కా ప్లాన్‌తో చేసిన మర్డర్ అని మేము అనుకుంటున్నాము," అని ఓ పోలీస్ అధికారి చెప్పారు.
కులకర్నిని ఎవరు హత్య చేశారు? అసలు ఆయన్ని ఎందుకు చంపారు? అన్న విషయాలపై ప్రస్తుతానికి స్పష్టత లేదు.
Ex IB officer RK Kulkarni : ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడిని పట్టుకునేందుకు ముమ్మర చర్యలు చేపట్టారు. రంగంలోకి దిగిన మూడు బృందాలు.. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.
ఇంటెలిజెన్స్ బ్యూరోలో మూడు దశాబ్దాల పాటు పని చేసిన కులకర్ని.. 23ఏళ్ల క్రితం రిటైర్ అయ్యారు.
సంబంధిత కథనం
Murder Mystery : ప్రియుడి మోజులో భర్త హత్య, దోపిడీ అంటూ నాటకం….
November 05 2022
Murder Politics In Vja : హత్యకు దారి తీసిన గ్రూపు గొడవలు
October 10 2022
బాలికపై అత్యాచారం..! ఆపై గొంతు నులిమి హత్య!
October 06 2022