Online cake death : ఆన్​లైన్​లో ఆర్డర్​ ఇచ్చిన కేక్​ తిని.. బాలిక మృతి!-video punjab girl 10 dies after eating cake ordered online ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Online Cake Death : ఆన్​లైన్​లో ఆర్డర్​ ఇచ్చిన కేక్​ తిని.. బాలిక మృతి!

Online cake death : ఆన్​లైన్​లో ఆర్డర్​ ఇచ్చిన కేక్​ తిని.. బాలిక మృతి!

Sharath Chitturi HT Telugu
Mar 31, 2024 11:46 AM IST

Online cake death : ఆన్​లైన్​లో ఆర్డర్​ ఇచ్చిన కేక్​ తిని.. పంజాబ్​లోని ఓ కుటుంబం అనారోగ్యానికి గురైంది. కుటుంబానికి చెందిన 10ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది.

కేక్​ తిని మరణించిన బాలిక..
కేక్​ తిని మరణించిన బాలిక.. (X/@RaovarinderSin2)

Online cake death viral video : పంజాబ్​లో షాకింగ్​ ఘటన వెలుగులోకి వచ్చింది. పటియాలాకు చెందిన పదేళ్ల బాలిక.. బర్త్​డే కేక్ తిని ప్రాణాలు కోల్పోయింది! దీంతో పటియాలా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేక్ ఆర్డర్ చేసిన రెస్టారెంట్ యజమానిని అరెస్టు చేశారు. బాలికకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

yearly horoscope entry point

ఇదీ జరిగింది..

మరణానికి గల కారణాలను తెలుసుకోవడానికి బాలిక మృతదేహాన్ని.. ఖరార్​లోని రాష్ట్ర ఫోరెన్సిక్ ల్యాబ్​కు పంపినట్లు పటియాలా సీనియర్ సూపరింటెండెంట్ పోలీస్ అధికారి వరుణ్ శర్మ తెలిపారు.

Girl dies after eating cake : సోషల్​ మీడియాలో వైరల్​గా మారిన వీడియో ప్రకారం.. అమ్మాయి తన కుటుంబ సభ్యులతో కలిసి కేక్​తో కూర్చొని ఉంది. ఆమె కేక్ కట్ చేయడం, కుటుంబ సభ్యులు ఆమెకు తినిపించడం, సెలబ్రేషన్స్​తో ఎంతో సంతోషంగా ఉండటం మనం వీడియోలో చూడవచ్చు.

ఆన్​లైన్​లో వైరల్​గా మారిన వీడియోను ఇక్కడ చూడండి.

ఈ నెల 24న బాలిక పుట్టిన రోజు జరుపుకున్న కుటుంబ సభ్యులు ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా కేక్ ఆర్డర్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Online cake death : కేక్ తిన్న కొన్ని గంటల్లోనే కుటుంబ సభ్యులందరి ఆరోగ్యం క్షీణించడం మొదలైందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బర్త్ డే గర్ల్ తో పాటు నలుగురు కుటుంబ సభ్యులు వరుసగా వాంతులు చేసుకోవడం ప్రారంభించారు. కొన్ని గంటల తర్వాత నిద్రలోకి జారుకున్న బాలిక.. మార్చ్​ 25 తెల్లవారుజామున అపస్మారక స్థితిలో కనిపించింది. ఉదయం కుటుంబ సభ్యులు కోలుకోగా, బాధితురాలిని సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కానీ ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ఈ ఘటనపై దర్యాప్తు కోసం మార్చ్​ 27న ఆరోగ్య శాఖను సంప్రదించామని, కానీ ఉన్నతాధికారులు పట్టించుకోలేదని మరణించిన బాలిక కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

Punjab girl dies after eating cake : ఈ ఘటనపై.. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జస్విందర్ సింగ్ మాట్లాడుతూ.. “కుటుంబం పాయిజనింగ్​ ఆరోపణలు చేస్తోంది. అది మా పరిశీలన కిందకు రాదు. బేకరీ వివరాలు సేకరించిన తర్వాత ఈ ఘటనపై స్పందిస్తాము,” అని అన్నారు.

మరోవైపు.. ఈ ఘటన సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. బాలిక మృతికి నెటిజన్లు సంతాపం తెలుపుతున్నారు. అప్పటివరకు నవ్వుతూ కనిపించిన బాలిక.. మరణించడం షాకింగ్​గా ఉందని అంటున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేస్తున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం