అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సౌదీ అరేబియా పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య కొత్తగా పలు ఒప్పందాలు కుదిరాయి. అక్కడ భారత్, పాక్ ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించానని కూడా ట్రంప్ మరోసారి చెప్పుకున్నారు. అయితే, ఇవన్నీ కాకుండా, ట్రంప్ సౌదీ పర్యటన సందర్భంగా మరో అంశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను పోస్ట్ చేసిన 24 గంటల్లోనే 15 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
డొనాల్డ్ ట్రంప్ మంగళవారం రియాద్ లో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ తో సమావేశమయ్యారు. అయితే ఈ భేటీకి సంబంధించిన క్షణాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అమెరికా, సౌదీ యూజర్ల మధ్య అసాధారణ చర్చకు దారితీసింది. వైరల్ గా మారిన ఆ వీడియోలో.. ట్రంప్, సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ల భేటీ సందర్భంగా ఇద్దరు నేతలకు ప్రత్యక కప్ లో ఒక డ్రింక్ ను సర్వ్ చేశారు. అయితే, ఆ పానీయాన్ని వెంటనే తాగేసి, కప్ ను తిరిగి సర్వెంట్ కు తిరిగి ఇచ్చేస్తారు. ట్రంప్ మాత్రం చాలా సేపు ఆ కప్ ను చేతిలో పట్టుకుని, కాసేపటి తరువాత, తమ వెనుక ఉన్న టేబుల్ పై ఆ కప్ ను పెట్టేశారు. ఈ ఘటనకు సంబంధించిన పలు వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై ట్రంప్ ఆ డ్రింక్ ను సిప్ చేయలేదని అమెరికా యూజర్లు వాదిస్తుండగా, లేదు, ట్రంప్ ఆ పానీయాన్ని తాగారని సౌదీ యూజర్లు తీవ్రంగా వాదించారు. తమ వాదనకు అనుగుణంగా ఉన్న వీడియోలను వారు షేర్ చేశారు. అయితే, అమెరికా అధ్యక్షుడికి కఠినమైన సెక్యూరిటీ ప్రొటోకాల్ ఉంటుందని, ఆయన తీసుకునే ఆహార పదార్ధాలకు కూడా అది వర్తిస్తుందని, అందువల్ల ట్రంప్ ఆ డ్రింక్ ను తాగలేదని పలువురు వాదించారు.
మరికొందరు ఈ పానీయంలో కెఫిన్ ఉండవచ్చునని ఊహించారు. ట్రంప్ కెఫీన్ ఉన్నపానీయాలను తీసుకోరని, అందువల్ల ఆ డ్రింక్ ను తీసుకోలేదని వివరించారు. ‘‘మీ ఆహారంలో ఏముందో తెలియకపోతే తినకండి. మీ నీటిలో ఏముందో మీకు తెలియకపోతే, దానిని తాగవద్దు. మీ వ్యాక్సిన్లో ఏముందో మీకు తెలియకపోతే, దానిని తీసుకోకండి’’ అని ఓ అమెరికన్ వ్యాఖ్యానించారు.
దీనికి విరుద్ధంగా, సౌదీ వినియోగదారులు ఆ వీడియో నుండి స్క్రీన్ షాట్లు, ప్రత్యామ్నాయ కోణాలను పంచుకోవడం ద్వారా ఈ వాదనలను తిప్పికొట్టారు. ట్రంప్ వాస్తవానికి ఆ పానీయాన్ని సేవించారని నొక్కిచెప్పారు. ‘‘కంటి రెప్పపాటులో తాగేశారు’’ అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. "అతను కప్పు మొత్తం తాగాడు" అని మరొకరు అన్నారు.
సంబంధిత కథనం