Man smoking in metro : మెట్రోలో బీడీ కాల్చిన వ్యక్తి.. వీడియో వైరల్- నెటిజన్లు సీరియస్!
Man smoking in metro : దిల్లీ మెట్రోలో ఎప్పుడు, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది! తాజాగా.. ఓ వ్యక్తి.. మెట్రోలో కూర్చిని స్టైల్‌గా బీడీ తాగుతూ కనిపించాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
Man smoking in metro : ప్రయాణికుల వింత, విచిత్ర ప్రవర్తనల కారణంగా ఇటీవలి కాలంలో అనేకమార్లు వార్తల్లో నిలిచింది దిల్లీ మెట్రో. ఇప్పుడు మళ్లీ వార్తలకెక్కింది! ఓ వ్యక్తి, మెట్రో లోపల బీడీ కాల్చుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం ఇందుకు కారణం.
ఇదీ జరిగింది..
వైరల్‌గా మారిన వీడియోలో.. ఓ వ్యక్తి కూర్చుని ఉండటం కనిపిస్తోంది. అతను, తన పాకెట్లో నుంచి బీడీ తీసి, అగ్గిపెట్టతో వెలిగించాడు. అనంతరం ఆ అగ్గిపుల్లను కింద పడేశాడు. అతని ఎదురుగా కూర్చుని ఉన్న ఓ వ్యక్తి, ఈ వీడియోను తన కెమెరాలో షూట్ చేశాడు. ఆ వ్యక్తి బీడీ కాలుస్తుండగా.. మరో వ్యక్తి అక్కడికి వెళ్లి, మెట్రోలో బీడీ కాల్చకూడదని చెబుతున్నప్పుడు.. వీడియో కట్ అయ్యింది.
Delhi metro viral video : దిల్లీ మెట్రోలోనే కాదు.. రైళ్లు, ఇతర మెట్రోల్లో ధూమపానంపై నిషేధం ఉంటుంది. స్టేషన్లో ఇలాంటివి చేస్తేనే సీరియస్‌గా పరిగణిస్తారు. ఇక మెట్రో లోపల కూర్చిని సిగరెట్ తాగితే కఠిన చర్యలు తప్పవు!
ఈ వీడియో ఎక్కడి తీశారు? ఎప్పుడు తీశారు? అన్న విషయాలపై క్లారిటీ లేదు. కాగా.. దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్.. ఈ వీడియోపై స్పందించింది.
Man smoking inside Delhi metro : "ఇలాంటి వాటిని అడ్డుకునేందుకు మా ఫ్లైయింగ్ స్క్వాడ్ తరచూ చెకింగ్ చేస్తుంది. ఇలాంటివేవైనా జరిగితే.. వెంటనే మాకు చెప్పాలని ప్రజలను కోరుతున్నాము. అప్పుడు.. మేము తక్షణమే చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది," అని దిల్లీ మెట్రో బృందం ఓ ప్రకటనలో తెలిపింది.
దిల్లీ మెట్రో లోపల ఓ వ్యక్తి బీడీ కాల్చుతున్న దృశ్యాలు చూసిన నెటిజన్లు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీడియో తీసిన వ్యక్తిపై కూడా కోపడుతున్నారు. "అలా వీడియో తీసే బదులు.. వెళ్లి ఆపొచ్చు కదా," అని అంటున్నారు. "ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది. ఇలాంటివన్నీ దిల్లీ మెట్రోలోనే కనిపిస్తాయేంటో!" అని మరో నెటిజన్ రాసుకొచ్చారు.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆ వీడియోను ఇక్కడ చూడండి :
మినీ స్కట్ వేసుకున్న ఓ యువతి, దిల్లీ మెట్రోలో ప్రయాణించిన వార్త కొన్ని నెలల క్రితం వైరల్‌గా మారింది. ఆ డ్రెస్ చూసిన వారు షాక్‌కు గురయ్యారు. మెట్రోల్లో, ఇంటి బయట ఎలాంటి దుస్తులు వేసుకోవాలి? అన్న టాపిక్‌పై తెగ చర్చలు జరిగాయి. ఆ వీడియో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం