Vida V1 Plus: అత్యంత తక్కువ ధరకే లేటెస్ట్ మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడా వీ 1 ప్లస్-vida v1 plus launched again at 30 000 rupees less than v1 pro check features price ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Vida V1 Plus Launched Again At 30,000 Rupees Less Than V1 Pro: Check Features, Price

Vida V1 Plus: అత్యంత తక్కువ ధరకే లేటెస్ట్ మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడా వీ 1 ప్లస్

HT Telugu Desk HT Telugu
Mar 01, 2024 05:16 PM IST

Vida V1 Plus: ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ విడా నుంచి మరోసారి వీ 1 ప్లస్ స్కూటర్ మార్కెట్లోకి వస్తోంది. విడా ఎలక్ట్రిక్ వీ1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఇండియాలో రూ. 97,800ల ప్రారంభ ధరతో, విస్తృత మార్కెట్ వాటా లక్ష్యంగా ఆవిష్కరించారు.

విడా వీ 1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్
విడా వీ 1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ (Vida)

Vida V1 Plus Electric scooter: ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్లో మార్కెట్ వాటాను పెంచుకునే లక్ష్యంతో వ్యూహాత్మకంగా విడా ఎలక్ట్రిక్ అధికారికంగా వీ 1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను సబ్సిడీల అనంతరం రూ. 97,800 లకు అందించనున్నట్లు ప్రకటించింది. భారత మార్కెట్లో అత్యంత చౌకగా లభించే ఎలక్ట్రిక్ స్కూటర్ వి 1 ప్లస్ అని కంపెనీ చెబుతోంది.

ట్రెండింగ్ వార్తలు

రెండు బ్యాటరీలు..

విడా వి1 ప్లస్ (Vida V1 Plus) రెండు రిమూవబుల్ 1.72 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ లను కలిగి ఉంది. ఈ బ్యాటరీ ప్యాక్ పరిధి 100 కిలోమీటర్లు, అలాగే, గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లు. ఈ ఇంజన్ గరిష్టంగా 6 కిలోవాట్ల శక్తిని, 25 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పూర్తి బ్యాటరీ ప్యాక్ ను 100% ఛార్జ్ చేయడానకిి 5 గంటల 15 నిమిషాల సమయం పడుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటు పోర్టబుల్ చార్జర్ ను అందిస్తున్నారు.

5 ఏళ్ల వారంటీ..

వారంటీ విషయానికి వస్తే, విడా వీ 1 ప్లస్ (Vida V1 Plus) 5 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీతో వస్తుంది. బ్యాటరీ ప్యాక్ 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల వారంటీతో వస్తుంది. ఈ స్కూటర్ కేవలం 3.4 సెకన్లలో 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని విడా ఎలక్ట్రిక్ చెబుతోంది. ఇంకా, వి 1 ప్లస్ లో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ తో సహా ఆల్-ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్ ఉంది. ఇది రాత్రిపూట రైడ్ సమయంలో సరైన విజిబిలిటీని అందిస్తుంది.

మూడు డిఫరెంట్ మోడ్స్

ఈ విడా వీ 1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఎకో, రైడ్, స్పోర్ట్ అనే మూడు విభిన్న మోడ్ లతో కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ బైక్ కు 7 అంగుళాల టీఎఫ్ టీ టచ్ స్క్రీన్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ను అమర్చారు. దీని వల్ల వీ1 ప్లస్ ఆకర్షణ మరింత పెరుగుతుంది. ఈ క్లస్టర్ ద్వారా ఇంటర్నెట్ తో కనెక్ట్ కావచ్చు. టర్న్-బై-టర్న్ నావిగేషన్, జియోఫెన్సింగ్, రిమోట్ ఇమ్మొబిలైజేషన్, వెహికల్ డయాగ్నోస్టిక్స్ వంటి ఫీచర్స్ ను వాడుకోవచ్చు. అదనంగా, Vida V1 Plus లో అదనపు భద్రత కోసం ఎస్ఓఎస్ అలర్ట్ సిస్టమ్ కూడా ఇందులో ఉంది.

సెక్యూరిటీ ఫీచర్స్

సెక్యూరిటీ ఫీచర్ల విషయానికొస్తే, వి1 ప్లస్ (Vida V1 Plus) లో యాంటీ-థెఫ్ట్ అలారం, ఫాలో-మీ-హోమ్ హెడ్ ల్యాంప్స్, కీ లెస్ ఎంట్రీ, ఎలక్ట్రానిక్ సీట్ అండ్ హ్యాండిల్ లాక్, క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ అండ్ రెజెన్ అసిస్ట్ కోసం టూ-వే థ్రోటిల్ ఉన్నాయి. బ్లూటూత్ సపోర్ట్ తో ఇన్ కమింగ్ కాల్ అలర్ట్ లను పొందవచ్చు.

WhatsApp channel