Women living with mother's dead body : ఏడాదిగా.. ఇంట్లోనే తల్లి మృతదేహం- అంత్యక్రియలకు డబ్బులు లేక!-varanasi women found living with mothers body ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Varanasi Women Found Living With Mother's Body

Women living with mother's dead body : ఏడాదిగా.. ఇంట్లోనే తల్లి మృతదేహం- అంత్యక్రియలకు డబ్బులు లేక!

Sharath Chitturi HT Telugu
Nov 30, 2023 02:01 PM IST

Women living with mother's dead body : తల్లి మృతదేహాన్ని ఇద్దరు కూతుళ్లు ఏడాదిగా ఇంట్లోనే దాచి పెట్టారు. మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేకపోవడంతో ఇలా చేశారు!

ఏడాదిగా.. ఇంట్లోనే తల్లి మృతదేహం- అంత్యక్రియలకు డబ్బులు లేక!
ఏడాదిగా.. ఇంట్లోనే తల్లి మృతదేహం- అంత్యక్రియలకు డబ్బులు లేక!

Women living with mother's dead body : ఉత్తర్​ ప్రదేశ్​ వారణాసిలో షాకింగ్​ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలు, తమ తల్లి మృతదేహాన్ని ఏడాదిగా ఇంట్లోనే దాచిపెట్టారు!

ట్రెండింగ్ వార్తలు

ఇదీ జరిగింది..

వారణాసిలోని మదర్వాన్​ ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. 52ఏళ్ల ఉషా తివారి అనే మహిళకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు పల్లవి, వైష్ణవి. పల్లవి వయస్సు 27ఏళ్లు. వైష్ణవి వయస్సు 18.

కాగా.. ఉషా తివారి సోదరి ఉపాసన, ఆమె భర్త ధర్మేంద్ర చతుర్వేది కలిసి.. బుధవారం వారణాసికి వెళ్లారు. అక్క ఉషను కలవాలని అనుకున్నారు. కానీ.. పల్లవి, వైష్ణవిలు.. వారిని ఇంట్లోకి రానివ్వలేదు. వారి ప్రవర్తనపై అనుమానం వచ్చి.. పోలీసులకు సమాచారం అందించాడు ధర్మేంద్ర. అప్పుడే అసలు విషయం బయటపడింది.

స్థానికంగా ఉండే పోలీసు అధికారి శివకాంత్​ మిశ్రా.. ఉషా తివారి ఇంటికి వెళ్లాడు. ఇంటి తలుపులను బద్దలు కొట్టి, లోపలికి ప్రవేశించాడు. అప్పుడే.. షాకింగ్​ ఘటన వెలుగులోకి వచ్చింది. ఉషా రాణి మృతదేహం దుప్పటి కింద ఉండటాన్ని గుర్తించాడు పోలీసు అధికారి. అసలేం జరిగిందని.. పల్లవిని, వైష్ణవిని నిలదీశాడు.

Uttar Pradesh latest news : "అనారోగ్యం కారణంగా.. ఏడాది క్రితం నా తల్లి మరణించింది. కానీ అంత్యక్రియలు చేసేందుకు మా దగ్గర డబ్బులు లేవు. అందుకే.. ఏడాదిగా దుప్పటిలోనే దాచి పెట్టాము. ఇక్కడే జీవిస్తున్నాము. ఎవరిని ఇంట్లోకి రానివ్వలేదు," అని పల్లవి, వైష్ణవిలు పోలీసులకు చెప్పారు.

"పల్లవికి మాస్టర్స్​ డిగ్రీ ఉంది. వైష్ణవి స్కూల్​లో చదువుకుంటోంది. పిల్లల్ని ఉపాసన తీసుకెళ్లారు. పోస్టుమార్టం చేసేందుకు ఉషా తివారీ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించాము," అని పోలీసులు వెల్లడించారు.

Uttar Pradesh crime news : పల్లవి,వైష్ణవి తండ్రి.. వారికి దూరంగా లక్నోలో జీవిస్తున్నాడు. ఉషకు స్థానికంగా ఓ కాస్మెటిక్​ షాప్​ ఉండేది. అదొక్కటే వారికి ఆదాయ మార్గం. కొవిడ్​ కారణంగా అది కూడా మూతపడింది. ఆ తర్వాత.. తల్లీకూతుళ్లు ఆర్థికంగా ఇబ్బంది పడినట్టు తెలుస్తోంది.

WhatsApp channel

సంబంధిత కథనం