Vaishali road accident : ప్రజలపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 12మంది దుర్మరణం!-vaishali road accident 12 dead after truck hits religious procession in bihar ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Vaishali Road Accident, 12 Dead After Truck Hits Religious Procession In Bihar

Vaishali road accident : ప్రజలపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 12మంది దుర్మరణం!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 21, 2022 06:36 AM IST

Vaishali road accident : అతివేగంతో దూసుకెళుతున్న ఓ ట్రక్కు.. రోడ్డు పక్కనే ఉన్న కొంతమందిపైకి దూసుకెళ్లిన ఘటన బీహార్​లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో 12మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రమాదం జరిగిన ప్రాంతంలో స్థానికులు
ప్రమాదం జరిగిన ప్రాంతంలో స్థానికులు (ANI)

Vaishali road accident : బిహార్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వైషాలీ జిల్లాలో.. కొంతమంది ప్రజలపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. బాధితులు.. రోడ్డు పక్కనే ఉన్న రావి చెట్టుకు పూజలు చేస్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 12మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు.

ట్రెండింగ్ వార్తలు

ఇదీ జరిగింది..

బిహార్​ రాజధాని పట్నాకు 30కి.మీల దూరంలోని దేస్రి పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సమీపంలోని సుల్తాన్​పూర్​లో కొన్ని రోజుల్లో ఓ పెళ్లి జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో.. వారందరు 'భూమియ బాబా'కు పూజలు చేసేందుకు బయలు దేరారు. రోడ్డు పక్కనే ఉన్న రావి చెట్టుకు పూజలు చేయడం మొదలుపెట్టారు. 

అదే సమయంలో.. మహ్నార్​- హాజీపూర్​ హైవేపై అతివేగంగా వెళుతున్న ఓ ట్రక్​ వారిపైకి దూసుకెళ్లింది. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. వైషాలీ రోడ్డు ప్రమాదం ఘటనలో ట్రక్కు డ్రైవర్​ కూడా మరణించినట్టు తెలుస్తోంది.

Vaishali road accident today : ఈ ఘటన జరిగిన ప్రాంతం.. మహౌ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. కాగా.. మహౌ ఎమ్మెల్యే ముకేశ్​ రోషన్​.. ఘటనస్థలానికి వెంటనే పరుగులు తీసి.. సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఇతర ప్రాంతాల ప్రజలు కూడా తరలివెళ్లి.. సహాయక చర్యల్లో పాల్గొన్నట్టు తెలుస్తోంది.

"వైషాలీ రోడ్డు ప్రమాదం ఘటనలో 9మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారిని సదర్​ హాస్పిటల్​కు తరలించాము. దారి మధ్యలో మరో ముగ్గురు మరణించారు. పరిస్థితి విషమంగా ఉన్న బాధితులను పట్నాకు తరలించాము," అని ముకేశ్​ వివరించారు.

మరోవైపు.. సుల్తాన్​పూర్​లో విషాదకర వాతావరణం నెలకొంది. బాధితుల కుటుంబాలు కన్నీరు పెట్టుకుంటున్నాయి. మృతుల్లో నలుగురు చిన్నారులు కూడా ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు.

ప్రధాని మోదీ.. సీఎం నితీశ్​ సంతాపం..

Bihar road accident : వైషాలీ రోడ్డు ప్రమాదం ఘటనపై సీఎం నితీశ్​ కుమార్​ స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తామని తెలిపారు.

ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్​ చేశారు.

"వైషాలీలో జరిగిన రోడ్డు ప్రమాదం చాలా బాధాకరం. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. పీఎంఎన్​ఆర్​ఎఫ్​ నుంచి రూ. 2లక్షల పరిహారాన్ని మృతుల కుటుంబాలకు ఇస్తున్నాను. క్షతగాత్రులకు రూ. 50వేలు అందిస్తాను," అని మోదీ ట్వీట్​ చేశారు.

Vaishali road accident death toll : వైషాలీ రోడ్డు ప్రమాదం ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. ఘటనపై సమాచారంతో తాను దిగ్భ్రాంతికి గురైనట్టు పేర్కొన్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్