Uttar Pradesh rains : భారీ వర్షాలకు 48గంటల్లో 22మంది మృతి!
Uttar Pradesh rains death toll : భారీ వర్షాల కారణంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో 48 గంటల వ్యవధిలో 22మంది ప్రాణాలు కోల్పోయారు.
Uttar Pradesh rains death toll : ఉత్తర్‌ప్రదేశ్‌ను వరుణుడు గడగడలాడిస్తున్నాడు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 48గంటల్లో ఏకంగా 22మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో తొమ్మిది మంది.. లక్నోలో గోడ కూలిన ఘటనలో సజీవ సమాధి అయ్యారు.
ట్రెండింగ్ వార్తలు
ఉత్తర్ప్రదేశ్పై వరుణుడి ప్రతాపం..
22 మరణాల్లో 13 ఉన్నావ్లో, ఫతేహ్‌పూర్‌లో 3, ప్రయాగ్‌రాజ్‌లో 2, సీతాపూర్, రాయ్‌బరేలీ, ఝాన్సీలో తలో ఒకటి నమోదయ్యాయి.
కాగా.. లక్నోలో గోడ కూలిన ఘటనపై స్పందిస్తూ.. "దిల్కుష ప్రాంతంలోని ఆర్మీ ఎన్క్లేవ్ బయట.. కొందరు కూలీలు గుడిసెల్లో జీవిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా అక్కడున్న గోడ కూలిపోయింది. మాకు సమాచారం అందిన తర్వాత.. ఘటనాస్థలానికి తెల్లవారుజామున ఉదయం 3 గంటలకు వెళ్లాము. 9 మృతదేహాలను వెలికితీశాము. ఒకరిని రక్షించాము. అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు," అని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పీయుష్ మోర్దియా వెల్లడించారు.
కాగా.. మృతిచెందిన వారందరు ఝాన్సీ జిల్లాకు చెందిన వారని తెలుస్తోంది.
Uttar Pradesh rains : లక్నోలో గోడ కూలిన ఘటనలో ప్రాణాలతో బయటపడిన వ్యక్తి పేరు గోలు. శిథిలాల కింద చిక్కుకున్న అతడు.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సహాయం కోసం తన ఫోన్ నుంచి పోలీసులకు ఫోన్ చేశాడు. అనంతరం అతడిని డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రక్షణమంత్రి రాజ్‌నాథ్, ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్‌లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మరోవైపు.. లక్నోలో గోడ కూలిన ఘటనలో మరణించిన కుటుంబాలకు రూ. 4లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది యూపీ ప్రభుత్వం. లక్నో నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్.. ఘటనాస్థలానికి, ఆసుపత్రికి వెళ్లారు. రోగులను పరిశీలించారు.
ఆర్ధరాత్రి కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో సైతం గోడ కూలిన ఘటనలు నమోదయ్యాయి.
Heavy rains in Uttar Pradesh : భారత వాతావరణశాఖ ప్రకారం.. గురువారం నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లో 32.2ఎంఎం సగటు వర్షపాతం నమోదైంది. ఎల్పీఏ(లాంగ్ పీరియడ్ యావరేజ్) కన్నా ఇది 428శాతం అత్యధికంగా ఉండటం గమనార్హం. ఉత్తర్‌ప్రదేశ్‌లోని 75జిల్లాల్లో 74.. శుక్రవారం అతిభారీ వర్షాలను చూశాయి.
బారాబంకిలో 192.7ఎంఎం, లక్నోలో 1116.9ఎంఎం, మౌలో 110ఎంఎం, బహ్రైచ్‌లో 108ఎంఎం, డియోరియాలో 78.5ఎంఎం, బల్రామ్పూర్లో 64ఎంఎం, బాలియాలో 63.9ఎంఎం, లఖింపూర్ ఖేరీలో 58.7ఎంఎం, ఝాన్సీలో 51ఎంఎం, ఉన్నావ్లో 14.7ఎంఎం, ప్రయాగ్‌రాజ్‌లో 8.4ఎంఎం వర్షపాతం నమోదైంది.
సంబంధిత కథనం
IMD Rain Alert: తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు
September 15 2022
Weather Update : తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రోజులు వర్షాలు
September 15 2022
Floods In Telangana : భారీ వర్షాలు.. ప్రాజెక్టులకు వరద నీరు
September 13 2022
Rain alert : ఐదు రోజుల పాటు భారీ వర్షాలు.. ప్రజలకు అలర్ట్
September 12 2022