Joe Biden: జో బైడెన్ కు మరోసారి కొవిడ్ పాజిటివ్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) మరోసారి కరోనా బారిన పడ్డారు. వైరస్ నుంచి కోలుకున్న మూడు రోజుల్లోనే బైడెన్‌కు మళ్లీ పాజిటివ్ వచ్చింది. ఈ మేరకు వైట్ హౌస్ నుంచి ప్రకటన వెలుబడింది.
us president joe biden tests positive for covid: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ మహమ్మారి దాడికి గురి కావడం 10 రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. వైరస్ బారి నుంచి బుధవారమే ఆయన కోలుకున్నారు. అతి కొద్దిరోజుల్లోనే మళ్లీ పాజిటివ్‌గా తేలడంతో ఆందోళన వ్యక్తవుతోంది. వైరస్ సోకిన విషయం తెలిసిన వెంటనే ఐసొలేషన్‌లోకి వెళ్లారు. ఇందుకు సంబంధించి వైట్‌హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది.
స్వల్ప కొవిడ్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించాం. ఎటువంటి అత్యవసర చికిత్స అవసరం లేదని.. ప్రస్తుతం అంతా బాగానే ఉన్నట్లు ఆయన శ్వేతసౌధ వైద్యుడు కానర్ చెప్పారు. ప్రస్తుతానికి అబ్జర్వేషన్ లో ఉంచి పరిస్థితులను గమనిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతానికి బైడెన్ ఐసోలేషన్ లో ఉన్నారని తెలిపారు.
ఇక జూలై 21న బైడెన్ కు కొవిడ్ సోకిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి చికిత్స పొందుతూ ఐసోలేషన్ లోనే ఉన్నారు. ఈ బుధవార నెగిటివ్ గా తేలటంతో... అధికారిక కార్యకలాపాలను కూడా ప్రారంభించారు. తైవాన్ వివాదం నేపథ్యంలో చైనా అధ్యక్షుడు గ్ఝి జిన్‌పింగ్‌తో ఫోన్‌లో సంభాషించారు. ఇప్పుడు మళ్లీ పాజిటివ్‌గా తేలటంతో… అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.
సంబంధిత కథనం