H-1B Visa : హెచ్-1బీ వీసాదారులకు భారీ ఉపశమనం- వేలాది మంది భారతీయులకు గుడ్ న్యూస్!
H-1B Visa news : హెచ్-1బీ వీసా రీవాలిడేషన్ ప్రక్రియను అమెరికా మొదలుపెట్టాలని చూస్తోంది. ఇదే జరిగితే వేలాది మంది భారతీయులకు ఊరట లభించనుంది.
H-1B Visa news : హెచ్-1బీ వీసా అంశంలో అమెరికా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది! కొన్ని ఎంపిక చేసిన కేటగిరీల్లో 'డొమెస్టిక్ వీసా రీవాలిడేషన్' ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని చూస్తోంది. ఇదే జరిగితే.. హెచ్1బీ, ఎల్1 వీసాల విషయంలో వేలాది మంది భారతీయులతో పాటు విదేశీయులు లబ్ధిపొందనున్నారు.
హెచ్-1బీ వీసా రీవాలిడేషన్..
పైలట్ ప్రాజెక్టులో భాగంగా వీసా రీవాలిడేషేన్ ప్రక్రియను చేపట్టాలని యూఎస్ చూస్తోంది. ఈ ఏడాది రెండో భాగంలో ఇది లాంచ్ అవ్వొచ్చు. పూర్తిస్థాయిలో దీనిని అమలు చేస్తే.. అమెరికాలోని భారతీయ టెక్ నిపుణులకు భారీ ఊరట లభిస్తుంది.
H-1B Visa revalidation : 2004 వరకు హెచ్-1బీ వంటి.. కొన్ని కేటగిరీల్లోని నాన్ ఇమిగ్రెంట్ వీసాలను అమెరికాలోపలే రెన్యూ/ స్టాంప్ చేయించుకునే వెసులుబాటు ఉండేది. ఆ తర్వాత నుంచి.. ఆయా వీసాలను రెన్యూ చేయించుకోవాలంటే.. సంబంధిత వీసాదారులు దేశం నుంచి బయటకు వెళ్లాల్సి వస్తోంది. సొంత దేశాలకు తిరిగి వెళ్లి, అక్కడ పాస్‌పోర్టుల మీద ఎక్స్టెన్షన్ స్టాంప్ వేయించుకోవాల్సి వస్తోంది.
అయితే.. ఈ ప్రక్రియ అంత సులభమైనది కాదు. చాలా మంది అమెరికాను వీడి, సోంత దేశాలకు తిరిగి వెళతారు. కానీ అక్కడ స్టాంపింగ్ ప్రక్రియ పూర్తవడానికి చాలా కాలం పడుతోంది. అన్ని డాక్యుమెంట్లు సమర్పించినప్పటికీ.. ఒక్కోసారి రెండేళ్ల కన్నా ఎక్కువ సమయమే పడుతుంది. ఇంతలో సంబంధిత కుటుంబాలు అమెరికాలో ఒంటరిగా ఉండిపోతున్నాయి. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రెసిడెన్షియల్ కమిషన్.. వీసా రీవాలిడేషన్ ప్రక్రియను ప్రారంభించాలని గత కొన్నేళ్లుగా అభ్యర్థిస్తూ వస్తోంది.
Indians H-1B Visa : ప్రస్తుతానికి అమెరికాలో హెచ్-1బీ వీసా రీస్టాంపింగ్కు అనుమతి లేదు. యూఎస్ కాన్సులేట్లలో రెన్యూ చేయించుకోవాలి. దేశం నుంచి బయటకు వెళ్లే హెచ్-1బీ వీసాదారులు.. వీసాను రెన్యూ చేయించుకునే సమయంలో పాస్‌పోర్టులపై సంబంధిత (రెన్యూ చేయించుకుంటున్న) డేట్‌ను స్టాంప్ వేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇప్పుడున్న ప్రక్రియ.. అటు విదేశీ ఉద్యోగులతో పాటు ఇటు అమెరికాలోని సంస్థలకు ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా వీసా వెయిటింగ్ పీరియడ్ దాదాపు రెండేళ్లుగా ఉంటుండటం తలనొప్పి తెచ్చిపెట్టే విషయం.
హెచ్-1బీ వీసా ఎంతో కీలకం..
H-1B Visa latest news : అమెరికాలోని కంపెనీలు.. విదేశీయులకు ఉద్యోగాలిస్తే, అక్కడి ప్రభుత్వం ఇచ్చే వీసానే ఈ హెచ్-1బీ. యూఎస్‌కు హెచ్-1బీ వీసాదారులు చాలా కీలకం. ఎన్నో దశాబ్దాలుగా.. లక్షలాది మంది భారతీయులు, చైనీయులు.. ఈ హెచ్-1బీ వీసా మీదే అమెరికాలో ఉద్యోగం చేయగలుగుతున్నారు.
"వీసా రీవాలిడేషన్ ప్రక్రియను త్వరలోనే పైలట్ ప్రాజెక్టు కింద ప్రారంభిస్తాము. ఎంత మంది వీసాదారులు దీనికి అర్హులు అన్నది ఇప్పుడే చెప్పలేము. కానీ.. ముందు చిన్న మొత్తంతో మొదలుపెట్టి, రానున్న 1-2ఏళ్లల్లో పూర్తిస్థాయికి తీసుకెళతాము," అని అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి తెలిపారు.
H-1B Visa status : వీసా ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు.. గత కొన్ని నెలలుగా అనేక చర్యలు చేపట్టింది అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం. ఇవి ఎందరో విదేశీయులకు ఉపమనాన్ని కలిగిస్తున్నాయి.
సంబంధిత కథనం