USA news: న్యూ ఇయర్ రోజు యూఎస్ లో జనసమూహం పైకి దూసుకెళ్లిన పికప్ వ్యాన్; 10 మందికి పైగా మృతి!
USA news: అమెరికా కొత్త సంవత్సరం వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. న్యూ ఇయర్ రోజు న్యూ ఓర్లీన్స్ లో జన సమూహంపైకి ఒక పికప్ ట్రక్ దూసుకెళ్లిన ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. చాలామందికి గాయాలైనట్లు సమాచారం. దుర్ఘటనలో న్యూ ఇయర్ రోజున ఓ కారు జనం గుంపును ఢీకొనడంతో పలువురు మృతి చెందారు.
New Orleans news: న్యూ ఇయర్ రోజున అమెరికాలోని న్యూ ఓర్లీన్స్ లో ఓ కారు వేగంగా దూసుకెళ్తూ, అక్కడి ప్రజలను ఢీ కొట్టిన దుర్ఘటనలో పలువురు మృతి చెందారు. న్యూ ఓర్లీన్స్ లోని బోర్బన్ స్ట్రీట్, ఐబర్ విల్లే కూడలి వద్ద తెల్లవారుజామున 3:15 గంటలకు దుర్ఘటన జరిగింది. వేగంగా వెళ్తున్న ఈ ఎస్ యూవీ పాదచారులను ఢీ కొట్టిందని డబ్ల్యూజీఎన్ వో తెలిపింది. బోర్బన్ స్ట్రీట్ ను దిగ్బంధించామని, అత్యవసర సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారని పోలీసులు తెలిపారు. అయితే మృతులు, క్షతగాత్రుల సంఖ్యను అధికారులు వెల్లడించలేదు.
కాల్పులు కూడా..
అమెరికా (USA)లోని న్యూ ఓర్లీన్స్ లో బోర్బన్ స్ట్రీట్ లో న్యూ ఇయర్ రోజు తెల్లవారు జామున ఓ ట్రక్కు అతివేగంతో, అక్కడ వేడుకలు జరుపుకుంటున్న జనాన్ని ఢీ కొడ్తూ వెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అనంతరం, డ్రైవర్ ఆ వాహనం నుంచి బయటకు వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడని, అతడిపై పోలీసులు ఎదురుకాల్పులు జరిపారని వివరించారు. ఈ ప్రమాదంలో కనీసం 10 లేదా అంతకంటే ఎక్కువ మంది మరణించినట్లు సోషల్ మీడియా సైట్ ఎక్స్ నివేదికలు సూచిస్తున్నాయి. అయితే, న్యూ ఓర్లీన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ వాదనలను ఇంకా ధృవీకరించలేదు.