US Man Jailed For 100 Years : చిన్నారి హత్య కేసులో నిందితుడికి 100ఏళ్ల జైలు శిక్ష!-us man jailed for 100 years over indian origin girl s death says report
Telugu News  /  National International  /  Us Man Jailed For 100 Years Over Indian-origin Girl's Death: Says Report
చిన్నారి హత్య కేసులో నిందితుడికి 100ఏళ్ల జైలు శిక్ష!
చిన్నారి హత్య కేసులో నిందితుడికి 100ఏళ్ల జైలు శిక్ష!

US Man Jailed For 100 Years : చిన్నారి హత్య కేసులో నిందితుడికి 100ఏళ్ల జైలు శిక్ష!

26 March 2023, 14:41 ISTSharath Chitturi
26 March 2023, 14:41 IST

US Man Jailed For 100 Years : భారత సంతతి చిన్నారి హత్య కేసులో ఓ వ్యక్తికి 100ఏళ్ల జైలు శిక్షపడింది. 2021లో జరిగిన ఘటనకు.. బాధితురాలి కుటుంబానికి న్యాయం దక్కింది.

US Man Jailed For 100 Years : అమెరికాలోని లుజియానా రాష్ట్రంలో ఓ 35ఏళ్ల వ్యక్తికి 100ఏళ్లు జైలు శిక్ష పడింది. భారత సంతతి చిన్నారి హత్య కేసులో దోషిగా తేలిన అతడికి.. ఓ జిల్లా కోర్టు ఈ శిక్షను విధించింది.

ఇదీ జరిగింది..

అది 2021 మార్చ్​ నెల.. విమల్​, స్నేహల్​ పటేల్​ అనే భారత సంతతి దంపతులకు మాంక్​హౌజ్​ డ్రైవ్​లో ఓ హొటల్​ ఉంది. దాని పేరు సూపర్​ 8 మోటెల్​. ఈ దంపతులకు మియా పటేల్​తో పాటు మరో సంతానం ఉంది. వీరందరు హోటల్​ గ్రౌండ్​ ఫ్లోర్​లో నివాసముండే వారు.

US crime news : కాగా.. 2021 మార్చ్​లో ష్రేవెపోర్ట్​కు చెందిన జోసేఫ్​ లీ స్మిత్​ అనే వ్యక్తి.. పటేల్​ ఉన్న హోటల్​ వద్దకు వెళ్లాడు. అక్కడి పార్కింగ్​ ఏరియాలో.. మరో వ్యక్తితో గొడవకు దిగాడు. కోపంతో ఊగిపోయిన స్మిత్​.. తన వద్ద ఉన్న తుపాకీని తీసి ఆ వ్యక్తిపై ఎక్కుపెట్టాడు. తుపాకీ కాల్చుడు. కానీ అది ఆ వ్యక్తిని తగలలేదు. బుల్లెట్​ నుంచి అతను తప్పించుకున్నాడు. ఆ బుల్లెట్ కాస్త​.. హోటల్​ గ్రౌండ్​ ఫ్లోర్​లో ఆడుకుంటున్న మియా పటేల్​ తలను తాకింది. అమె కుప్పకూలిపోయింది. ఈ ఘటన జరిగిన సమయంలో మియా పటేల్​ వయస్సు 5ఏళ్లు.

మియాను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. 3 రోజుల పోరాటం అనంతరం 2021 మార్చ్​ 23న.. మియా ప్రాణాలు విడిచింది.

100ఏళ్ల జైలు శిక్ష..

Mya Patel death news : దాదాపు మూడేళ్ల పాటు ఈ కేసుపై విచారణ జరిగింది. స్మిత్​ను దోషిగా తేలుస్తూ.. ఈ ఏడాది జనవరిలో కడ్డో పారిష్​ జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. తాజాగా శిక్షను విధించింది.

చేసిన తప్పుకు స్మిత్​ మొత్తం మీద 100ఏళ్లు జైలు శిక్షను అనుభవించనున్నాడు. ఇందులో 60ఏళ్లు కఠిన ఖారాగార శిక్ష ఉంటుంది. ఈ సమయంలో ఎలాంటి ప్రొబేషన్​, పెరోల్​, శిక్ష తగ్గింపు వంటివి చర్యలు ఉండవు.

సంబంధిత కథనం