US home loan interest rate: 20 ఏళ్ల గరిష్టానికి హోం లోన్ వడ్డీ రేటు-us home loan interest rates jump to highest in over 20 years
Telugu News  /  National International  /  Us Home Loan Interest Rates Jump To Highest In Over 20 Years
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం ( Photo: iStock)

US home loan interest rate: 20 ఏళ్ల గరిష్టానికి హోం లోన్ వడ్డీ రేటు

26 October 2022, 21:09 ISTHT Telugu Desk
26 October 2022, 21:09 IST

US home loan interest rate: అమెరికాలో గృహ రుణాల వడ్డీ రేట్లు 20 సంవత్సరాల గరిష్టానికి చేరాయి. ఇది యూఎస్ లోని రియల్టీ రంగంపై తీవ్ర స్థాయిలో ప్రతికూల ప్రభావం చూపుతోంది.

US home loan interest rate: 30 సంవత్సరాల కాల వ్యవధితో హోం లోన్ ఫిక్స్ డ్ రేట్ సగటు కాంట్రాక్ట్ రేటు తాజాగా 22 బేసిస్ పాయింట్లు పెరిగింది. దాంతో, అక్టోబర్ 21 వారాంతానికి ఈ వడ్డీ రేటు 7.16 శాతానికి చేరింది.

US home loan interest rate: MBA

ఈ వడ్డీ రేటు పెంపుతో Mortgage Bankers Association(MBA) మార్కెట్ ఇండెక్స్ ప్రకారం హోం లోన్ దరఖాస్తుల సంఖ్య అక్టోబర్ 21 వారాంతానికి అంతకుముందు వారంతో పోలిస్తే 1.7% తగ్గింది. అంతేకాకుండా, ఇంత తక్కువ సంఖ్యలో దరఖాస్తులు దాఖలవడం 1997 తరువాత ఇదే ప్రథమం.

US home loan interest rate: 2001 తరువాత ఇదే హైయెస్ట్..

యూఎస్ లో హోం లోన్ ఇంట్రెస్ట్ రేటు 2001లో అత్యధికంగా ఉండేది. ఆ తరువాత ఆ స్థాయిలో వడ్డీ రేటు పెరగడం ఇదే ప్రథమం. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి హోం లోన్ వడ్డీ రేటు అమెరికాలో దాదాపు రెండింతలు పెరిగింది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం కోసం ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు ను పెద్ద ఎత్తున చేపట్టిన కారణంగా హోం లోన్ వడ్డీ రేటు భారీగా పెరిగింది. నవంబర్ 1 లేదా 2 వ తేదీల్లో ఫెడ్ రేట్లలో మళ్లీ పెరుగుదల చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.