Global warming alert : అమెరికా నుంచి జపాన్ వరకు రెడ్ అలర్ట్.. భయపడిపోతున్న ప్రజలు!
Heatwave global warming : అమెరికా నుంచి జపాన్ వరకు హీట్‌వేవ్ పరిస్థితులు ప్రజలను భయపెడుతున్నాయి. అనేక ప్రాంతాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ దేశాల్లో రెడ్ అలర్ట్‌లు అమల్లో ఉన్నాయి.
Heatwave global warming : వాతావరణ మార్పులతో ప్రపంచంపై పడుతున్న ప్రతికూల ప్రభావానికి అద్ధం పట్టే మరో సంఘటన! హీట్‌వేవ్‌తో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్నాయి. అమెరికాలో పరిస్థితులు అంత్యంత ఆందోళనకరంగా ఉండగా.. యూరోప్, పశ్చిమాసియా, జపాన్‌లు భారీ ఉష్ణోగ్రతలను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి జపాన్ వరకు అనేక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ అవ్వడం గమనార్హం.
ట్రెండింగ్ వార్తలు
అమెరికాలో ఇలా..
గ్లోబల్ వార్మింగ్ ప్రభావం అమెరికాలో స్పష్టంగా కనిపిస్తోంది. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ వారాంతంలో.. కాలిఫోర్నియా నుంచి టెక్సాస్ వరకు ఉష్ణోగ్రతలు భయానకంగా ఉంటాయని అధికారులు హెచ్చరించారు. సాధారణం కన్నా 10 నుంచి 20 డిగ్రీల ఫారెన్హైట్ టెంపరేచర్ నమోదవుతుందని అంచనా వేశారు.
Heatwave in America : ఆరిజోనా రాష్ట్రంలో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. రాజధాని నగరం ఫీనిక్స్‌లో వరుసగా 16 రోజుల పాటు సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏసీల్లో కూర్చున్నప్పటికీ.. ప్రజలు చెమటలు ఛిందిస్తున్నారు!
మరోవైపు భూమిపై ఉష్ణోగ్రతలు అత్యంత ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లో ఒకటైన కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీ.. తాజా పరిస్థితులతో అల్లాడిపోతోంది. అక్కడ ఉష్ణోగ్రతలు ఆదివారం 54 డిగ్రీల సెల్సియస్‌ను తాకుతాయని వాతావరణశాఖ అంచనా వేసింది. ఉదయం పూట ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని, నిత్యం హైడ్రేటెడ్‌గా ఉండాలని సూచనలు జారీ చేశారు.
కానీ ప్రజలపై ఇప్పటికే ప్రతికూల ప్రభావం పడింది! మంచి నీరు తాగుతున్నా వాంతులు అవుతున్నాయని చాలా మంది చెబుతున్నారు.
యూరోప్‌లో ఇలా..
ఇక గ్లోబల్ వార్మింగ్ రెడ్ అలర్ట్‌ను ఎదుర్కొనేందుకు యూరోప్ సన్నద్ధమవుతోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇటలీ, రోమ్తో పాటు 16 నగరాల్లో రెడ్ అలర్ట్ జారీ అయ్యింది.
Europe heatwave alert : "దేశ చరిత్రలోనే అతిపెద్ద హీట్‌వేవ్‌కు ప్రజలు సిద్ధంగా ఉండాలి," అని ఇటలీ ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు రోమ్‌లో సోమవారం నాటికి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటుతాయని, మంగళవారం నాటికి 43 డిగ్రీలకు చేరుకుంటాయని తెలుస్తోంది. 2007 ఆగస్ట్ తర్వాత ఇదే అత్యధికం!
ఫ్రాన్స్‌లో కూడా హీట్‌వేవ్ పరిస్థితులు ఇలాగే ఉన్నాయి! జూన్‌లో హీట్‌వేవ్‌తో అల్లాడిపోయిన ప్రజలు.. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితులే ఎదురవుతాయి అంటుంటే ఆందోళన చెందుతున్నారు.
జపాన్.. ఇండియా..
జపాన్‌లో వాతావరణ మార్పుల ప్రభావం ఇప్పుడిప్పుడే కనిపిస్తోంది. అక్కడ ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఆది, సోమవారం నాటికి టెంపరేచర్ 38-39 డిగ్రీల సెల్సియెస్ను తాకే అవకాశం ఉందని, ఇదే జరిగితే గత రికార్డు బ్రేక్ అవుతుందని అధికారులు చెబుతున్నారు. అనేక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు.
Delhi floods 2023 : మరోవైపు రెండు, మూడు నెలల పాటు హీట్‌వేవ్‌తో అల్లాడిపోయిన భారతీయులు.. ఇప్పుడు భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు!ముఖ్యంగా ఉత్తర భారతంలో పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ముకశ్మీర్‌లలో కొన్ని రోజుల క్రితం వరకు అతి భారీ వర్షాలు కురిసి, ప్రజలను ఇబ్బంది పెట్టాయి. ఇక దిల్లీలో పరిస్థితుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది! యమునా నది ఉప్పొంగడంతో దిల్లీలోని రోడ్లు జలమయం అయ్యాయి.
సంబంధిత కథనం