UPSC Recruitment 2023 : అసిస్టెంట్ ఇంజినీర్ సహా ఇతర పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్..
UPSC Recruitment 2023 : రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది యూపీఎస్సీ. ఈ దఫా మొత్తం 20 పోస్టులను భర్త చేయనుంది. ఆ వివరాలు..
UPSC Recruitment 2023 : అసిస్టెంట్ ఇంజినీర్‌తో పాటు ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్). అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ upsc.gov.in లోకి వెళ్లి ఆన్‍లైన్‍లో అప్లికేషన్‌ను దాఖలు చేయవచ్చు. అప్లికేషన్ ప్రక్రియ 2023 జూన్ 15తో ముగియనుంది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్‌లోని ముఖ్య వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..
యూపీఎస్సీ రిక్రూట్మెంట్ 2023..
ఈ దఫా రిక్రూట్మెంట్లో మొత్తం 20 పోస్టులను యూపీఎస్ఈ భర్తీ చేయనుంది. అవి..
సైంటిస్ట్ బీ (ఎలక్ట్రికల్):- 1 పోస్టు
అసిస్టెంట్ ఇంజినీర్:- 9 పోస్టులు
స్పెషలిస్ట్ గ్రేడ్ 3:- 6 పోస్టులు
UPSC Recruitment 2023 apply online : జూనియర్ షిప్ సర్వేయర్- అసిస్టెంట్ డైరక్టర్ జనరల్- 1 పోస్టు
జూనియర్ రీసెర్చ్ ఆఫీసర్- 3 పోస్టులు
ఎలిజబులిటీ..
సంబంధిత పోస్టులకు అప్లై చేస్తున్న అభ్యర్థులు.. ఎలిజబులిటీ, వయస్సు పరిమితి వంటి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. (యూపీఎస్సీ నోటిఫికేషన్)
ఇదీ చూడండి:- UPSC Civils 2022 results: యూపీఎస్సీ సివిల్స్ 2022 ఫలితాల వెల్లడి; తొలి నాలుగు ర్యాంకులు మహిళలకే..
అప్లికేషన్ ఫీజు..
ఎస్సీ/ఎస్టీ/ మహిళలు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇతరులు రూ. 200 ఫీజు చెల్లించాలి. ఏదైనా ఎస్బీఐ బ్రాంచ్‌లో క్యాష్ ఇవ్వొచ్చు లేదా డెబిట్/ క్రెడిట్/ యూపీఐ/ నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం.. అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను చూడాల్సి ఉంటుంది.
ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ 2023..
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC).. 300 అసిస్టెంట్ మేనేజర్ (ఆపరేషన్స్/మెయింటెనెన్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హత గల అభ్యర్థులు careers.ntpc.co.in వెబ్‍సైట్‍లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‍లైన్‍లో దరఖాస్తులు సమర్పించేందుకు జూన్ 2 ఆఖరు తేదీగా ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం