UPSC Recruitment 2023 : యూపీఎస్​సీలో ఉద్యోగాలు.. అప్లికేషన్​ ప్రక్రియ మొదలు-upsc recruitment 2023 apply for 18 assistant public prosecutor other posts ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Upsc Recruitment 2023: Apply For 18 Assistant Public Prosecutor &Amp; Other Posts

UPSC Recruitment 2023 : యూపీఎస్​సీలో ఉద్యోగాలు.. అప్లికేషన్​ ప్రక్రియ మొదలు

Sharath Chitturi HT Telugu
Sep 23, 2023 01:18 PM IST

UPSC Recruitment 2023 : యూపీఎస్​సీఓ ఉద్యోగాల కోసం అప్లికేషన్​ ప్రక్రియ మొదలైంది. ఆ వివరాలు..

యూపీఎస్​సీఓ ఉద్యోగాలు.. అప్లికేషన్​ ప్రక్రియ మొదలు
యూపీఎస్​సీఓ ఉద్యోగాలు.. అప్లికేషన్​ ప్రక్రియ మొదలు

UPSC Recruitment 2023 : వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ను విడుదల చేసింది యూపీఎస్​సీ (యూనియన్​ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​). అప్లికేషన్​ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఈ దఫా రిక్రూట్​మెంట్​లో అసిస్టెంట్​ పబ్లిక్​ ప్రాసిక్యూటర్​తో పాటు మొత్తం మీద 18 పోస్టులను భర్తీ చేయనుంది. అప్లికేషన్​ దాఖలుకు తుది గడువు అక్టోబర్​ 12. ఈ నేపథ్యంలో క్వాలిఫికేషన్​, ఫీజు వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

యూపీఎస్​సీ రిక్రూట్​మెంట్​ 2023..

మొత్తం వేకెన్సీలు:- 18

డేంజరెస్​ గూడ్స్​ ఇన్​స్పెక్టర్​:- 3 పోస్టులు

ఫోర్​మెన్​ (కెమికల్​):- 1 పోస్టు

ఫోర్​మెన్​ (మెటలర్జీ):- 1 పోస్టు

ఫోర్​మెన్​ (టెక్స్​టైల్​):- 2 పోస్టులు

UPSC Recruitment 2023 apply online : డిప్యూటీ అసిస్టెంట్​ డైరక్టర్​ (ఫోరెన్సీక్​ సైన్స్​):- 1 పోస్టు

డిప్యూటీ అస్సిస్టెంట్​ డైరక్టర్​ (లెక్చరర్​​):- 1 పోస్టు

అసిస్టెంట్​ పబ్లిక్​ ప్రాసిక్యూటర్​:- 7 పోస్టులు

ఉనాని ఫిజీషియన్​:- 2 పోస్టులు

విద్యార్హత:- ఈ దఫా రిక్రూట్​మెంట్​లో పాల్గొనాలని చూస్తున్న వారు నోటిఫికేషన్​ను పూర్తిగా చదవాల్సి ఉంటుంది. యూపీఎస్​సీ రిక్రూట్​మెంట్​ 2023 నోటిఫికేషన్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

UPSC Recruitment 2023 notification : సెలక్షన్​ కోసం రిక్రూట్​మెంట్​ పరీక్ష ఉంటుంది. అందులో పాసైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ ఉంటుంది.

అప్లికేషన్​ ఫీజు:- ఎస్​సీ, ఎస్​టీ, వికలాంగులు, మహిళలకు ఉచితం. ఇతరులు రూ. 25 చెల్లించాల్సి ఉంటుంది.

ఐడీబీఐ బ్యాంక్​ నోటిఫికేషన్​..

వివిధ పోస్టుల భర్తీకి అనేక బ్యాంక్​ సంస్థలు ఇటీవలి కాలంలో నోటిఫికేషన్​ను విడుదల చేస్తున్నాయి. ఈ జాబితాలోకి ఐడీబీఐ బ్యాంక్​ కూడా చేరింది. జూనియర్​ అసిస్టెంట్​ మేనేజర్​ పోస్టుల వేకెన్సీని భర్తీ చేసేందుకు రిక్రూట్​మెంట్​ డ్రైవ్​ను నిర్వహిస్తోంది సంస్థ. అప్లికేషన్​ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఈ నెల 30 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

WhatsApp channel

సంబంధిత కథనం