UPSC EPFO Recruitment: ఈపీఎఫ్ఓ రిక్రూట్ మెంట్; మార్చి 17 లాస్ట్ డేట్-upsc epfo recruitment 2023 commission issues notice for applicants ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Upsc Epfo Recruitment 2023: Commission Issues Notice For Applicants

UPSC EPFO Recruitment: ఈపీఎఫ్ఓ రిక్రూట్ మెంట్; మార్చి 17 లాస్ట్ డేట్

HT Telugu Desk HT Telugu
Mar 15, 2023 06:08 PM IST

UPSC EPFO Recruitment 2023: ఈపీఎఫ్ఓ లో 577 పోస్ట్ ల భర్తీకి గానూ యూపీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్ పై కీలక అప్ డేట్ వెలువడింది. ఈ రిక్రూట్ మెంట్ లో అప్లికేషన్ల సబ్మిషన్ కు మార్చి 17 ఆఖరు తేదీ అని, అయితే, చివరి నిమిషం వరకు జాప్యం చేయకుండా, ముందే అప్లై చేసుకోవాలని సూచించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (HT Photo)

UPSC EPFO Recruitment 2023: ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (Employees' Provident Fund Organisation EPFO) లో 577 అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్ (Asstt. Provident Fund Commissioner and Enforcement Officer-Accounts Officer) పోస్ట్ లను భర్తీ చేయడానికి యూపీఎస్సీ (Union Public Service Commission UPSC) ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 17. అయితే, ఆ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు చివరి నిమిషం వరకు ఎదురు చూడకుండా, వెంటనే దరఖాస్తు చేసుకోవాలని యూపీఎస్సీ ఒక ప్రకటనలో సూచించింది.

ట్రెండింగ్ వార్తలు

UPSC EPFO Recruitment 2023: మొత్తం 577 పోస్ట్ లు..

ఈ Asstt. Provident Fund Commissioner and Enforcement Officer-Accounts Officer పోస్ట్ లకు ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలి. అందుకు గానూ అభ్యర్థులు upsc.gov.in. వెబ్ సైట్ ను సందర్శించాలి. ముందుగా డిటైల్ నోటిఫికేషన్ ను క్షుణ్నంగా చదువుకోవాలి. మొత్తం 577 పోస్ట్ ల్లో 418 ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసర్ / అకౌంట్స్ ఆఫీసర్ (Enforcement Officer/Accounts Officer) పోస్ట్ లు, 159 అసిస్టెంట్ ప్రావిడెండ్ ఫండ్ కమిషనర్ (Assistant Provident Fund Commissioner) పోస్ట్ లు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ముందుగా రాత పరీక్ష, ఆ తరువాత ఇంటర్వ్యూ ఉంటాయి. ఈ రెండు పోస్ట్ లకు రాత పరీక్ష వేరువేరుగా ఉంటుంది. వయో పరిమితి, విద్యార్హతలు, పరీక్ష విధానం, సిలబస్ మొదలైన వివరాలు నోటిఫికేషన్ లో వివరంగా ఉన్నాయి.

IPL_Entry_Point