UPSC CMSE results: యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీస్ పరీక్ష ఫలితాల వెల్లడి-upsc cmse 2022 final results out check list of recommended candidates ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Upsc Cmse 2022 Final Results Out, Check List Of Recommended Candidates

UPSC CMSE results: యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీస్ పరీక్ష ఫలితాల వెల్లడి

HT Telugu Desk HT Telugu
Jun 02, 2023 09:11 PM IST

కంబైన్డ్ మెడికల్ సర్వీస్ (CMS) 2022 పరీక్ష ఫలితాలను యూపీఎస్సీ (UPSC) శుక్రవారం విడుదల చేసింది. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు ఫలితాలను యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ www.upsc.gov.in. లో చెక్ చేసుకోవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

కంబైన్డ్ మెడికల్ సర్వీస్ (CMS) 2022 పరీక్ష ఫైనల్ ఫలితాలను యూపీఎస్సీ (UPSC) శుక్రవారం విడుదల చేసింది. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు ఫలితాలను యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ www.upsc.gov.in. లో చెక్ చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

మొత్తం 629 మందిని..

కంబైన్డ్ మెడికల్ సర్వీస్ రాత పరీక్ష (పార్ట్ 1) ను 2022 జులై 17న నిర్వహించారు. ఆ తరువాత ఏప్రిల్, మే నెలల్లో పార్ట్ 1 లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ (పార్ట్ 2) ని నిర్వహించారు. అందులో ఉత్తీర్ణులైన వారి జాబితాను శుక్రవారం యూపీఎస్సీ విడుదల చేసింది. రెండు కేటగిరీల్లో వారిని రిక్రూట్ చేసుకోవాలని సూచిస్తూ ఆ జాబితాను యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్లో అప్ లోడ్ చేశారు. కేటగిరీ 1 లో 307 మందిని, కేటగిరీ 2 లో 322 మందిని వివిధ సర్వీసుల్లో నియామకాలకు యూపీఎస్సీ సిఫారసు చేసింది.

రిజల్ట్ చెక్ చేసుకోవడం ఎలా?

యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఫైనల్ ఫలితాలను అభ్యర్థులు upsc.gov.in. వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. అందుకు గానూ వారు

  • ముందుగా యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ upsc.gov.in. ను ఓపెన్ చేయాలి.
  • హోంపేజీపై కనిపిస్తున్న “Final Result - Combined Medical Services Examination, 2022” పై క్లిక్ చేయాలి.
  • స్క్రీన్ పై కనిపిస్తున్న పీడీఎఫ్ ఫైల్ లో రోల్ నంబర్ ఆధారంగా రిజల్ట్ ను చూసుకోవచ్చు.
  • భవిష్యత్ అవసరాల కోసం రిజల్ట్ పేజీని డౌన్ లోడ్ చేసుకుని భద్రపర్చుకోవాలి.
  • Direct link to check Final Result - Combined Medical Services Examination, 2022

IPL_Entry_Point