UPSC 2024 Calendar: 2024 క్యాలెండర్‌ను విడుదల చేసిన యూపీఎస్‍సీ.. వివిధ పరీక్షల తేదీలు ఇవే!-upsc 2024 calendar released check cse nda cds and more examination dates ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Upsc 2024 Calendar Released Check Cse Nda Cds And More Examination Dates

UPSC 2024 Calendar: 2024 క్యాలెండర్‌ను విడుదల చేసిన యూపీఎస్‍సీ.. వివిధ పరీక్షల తేదీలు ఇవే!

UPSC 2024 Calendar: 2024 క్యాలెండర్‌ను విడుదల చేసిన యూపీఎస్‍సీ
UPSC 2024 Calendar: 2024 క్యాలెండర్‌ను విడుదల చేసిన యూపీఎస్‍సీ

UPSC 2024 Calendar: 2024 పరీక్షల క్యాలెండర్‌ను యూపీఎస్‍సీ వెల్లడించింది. ఎగ్జామ్‍ల తేదీలను ప్రకటించింది.

UPSC 2024 Calendar: వచ్చే ఏడాది (2024)కి సంబంధించిన పరీక్షల క్యాలెండర్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Union Public Service Commission - UPSC) నేడు ప్రకటించింది. 2024లో వివిధ పరీక్షలు ఏఏ తేదీల్లో ఉంటాయో వెల్లడించింది. వీటిని గమనించి.. అందుకు అనుగుణంగా అభ్యర్థులు ప్రిపేర్ కావొచ్చు. 2024కు సంబంధించిన క్యాలెండర్‌ను upsc.gov.in వెబ్‍సైట్‍లో విడుదల చేసింది యూపీఎస్‍సీ. 2024 సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ (CSE) పరీక్ష, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (IFS) ప్రిలిమినరీ ఎగ్జామ్ 2024 మే 26వ తేదీన జరగనున్నాయి. మిగిలిన పరీక్షల తేదీల వివరాలు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

UPSC 2024 Calendar: యూపీఎస్‍సీ 2024 క్యాలెండర్ ప్రకారం, నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA), కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (CDS) (1) పరీక్ష 2024 ఏప్రిల్ 21న జరగనుంది. ఎన్‍డీఏ, సీడీఎస్ (2) పరీక్షలు సెప్టెంబర్ 1వ తేదీన ఉండనున్నాయి.

UPSC 2024 Calendar: యూపీఎస్‍సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష (CSE) 2024 మెయిన్స్ సెప్టెంబర్ 20వ తేదీన జరగనుంది.

UPSC 2024 Calendar: యూపీఎస్‍సీ రిక్రూట్‍మెంట్ టెస్టులు (RTs) 2024లో జనవరి 13, ఫిబ్రవరి 24, మార్చి 9, జూలై 6, ఆగస్టు 10, అక్టోబర్ 19, డిసెంబర్ 21 తేదీల్లో ఉండనున్నాయి. యూపీఎస్‍సీ ఇంజినీరింగ్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (ESE Prelims) 2024 ఫిబ్రవరి 18వ తేదీ జరుగుతుంది. మెయిన్స్ జూన్ 23న ఉంటుంది.

UPSC 2024 Calendar: కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ (CMS) పరీక్ష 2024 జూలై 14న ఉంటుంది. యూపీఎస్‍సీ సీఏపీఎఫ్ ఏసీ (UPSC CAPF ACs) 2024 ఎగ్జామ్‍ను ఆగస్టు 4న యూపీఎస్‍సీ నిర్వహించనుంది.

ఏవైనా అనుకోని పరిస్థితులు ఎదురైతే నోటిఫికేషన్ల జారీ తేదీలు, పరీక్షల తేదీల్లో మార్పులు ఉండొచ్చని యూపీఎస్‍సీ పేర్కొంది.

మరోవైపు, ఈ ఏడాది యూపీఎస్‍సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష ఈ నెల 28న (మే 28, 2023) జరగనుంది. ఇప్పటికే అడ్మిట్ కార్డులను యూపీఎస్‍సీ విడుదల చేసింది.

WhatsApp channel