Crime news : మహిళపై కన్నేసిన అక్క భర్త! రేప్ చేసి చంపేసి..
Crime news : యూపీలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది! ఆ మహిళ సోదరి భర్తే నిందుతుడు! కొంతమందితో కలిసి మహిళను రేప్ చేసిన అతను, చివరికి ఆమెను చంపేశాడు. మృతదేహాన్ని తగలబెట్టాడు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళపై ఆమె అక్క భర్త కన్నేశాడు! చివరికి, ఇతరులతో కలిసి ఆమెను రేప్ చేసి చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని తగలబెట్టేందుకు ప్రయత్నించాడు.

ఇదీ జరిగింది..
యూపీలోని బుధానా అనే ప్రాంతంలోని బవానా అనే గ్రామంలో జరిగింది ఈ ఘటన. 21ఏళ్ల మహిళ కనిపించడం లేదని.. జనవరి 23న ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే వారికి కొన్ని షాకింగ్ విషయాలు తెలిశాయి.
పోలీసుల కథనం ప్రకారం.. అదృశ్యమైన మహిళకు ఒక అక్క ఉంది. ఆమె భర్త పేరు ఆశిష్. ఇతను.. తన భార్య సోదరిపై కన్నేసాడు. తనని పెళ్లి చేసుకోవాలని వెంటపడేవాడు. కానీ ఆమె ఒప్పుకోలేదు.
ఈ క్రమంలోనే ఆశిష్, తన సహచరులతో కలిసి ఓ రోజు ఆ 21ఏళ్ల మహిళ ఇంటికి వెళ్లాడు. పని మీద బయటకు వెళ్లాలని ఆమెను ఎవరూ లేని చోటకు తీసుకెళ్లాడు. అక్కడే వారందరు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె గొంతు నులిమి చంపేశారు.
ఆ తర్వాత.. సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు నిందితులు ప్రయత్నించారు. మహిళ మృతదేహాన్ని కాల్చేశారు.
దర్యాప్తులో భాగంగా ఈ విషయాలను తెలుసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆశిష్‌ని పట్టుకుని విచారించగా అతను నేరానికి అంగీకరించాడు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇంకొంతమందిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
మరోవైపు ఘటనాస్థలానికి వెళ్లిన ఫోరెన్సీక్ నిపుణుల బృందం కీలక ఆధారాలను సేకరించింది. ఆ రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నట్టు పోలీసులు వివరించారు.
మరోవైపు ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. మిగిలిన నిందితులను త్వరలోనే పట్టుకుంటాని, అందరిని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.
కేఫ్‌లో బాలికపై అత్యాచారం..
ముజఫర్‌నగర్ జిల్లాలోని ఓ కేఫ్‌లో దారుణం జరిగింది. 15 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు!
నిందితుడు విశాల్, అతని స్నేహితుడు అంకిత్యయ కేఫ్ యజమాని అక్షయ్ శర్మలపై బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా ముగ్గురిని అరెస్టు చేసినట్లు సర్కిల్ ఆఫీసర్ రూపాలీ రావు తెలిపారు.
పదో తరగతి చదువుతున్న బాలికను కేఫ్‌కు పిలిపించి విశాల్, అంకిత్‌లు అత్యాచారానికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
కేఫ్‌లో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు కేఫ్ యజమానిని కూడా అరెస్టు చేసినట్లు రూపాలీ రావు తెలిపారు.
నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
బాలికను వైద్య పరీక్షలకు పంపినట్లు పోలీసులు తెలిపారు.
సంబంధిత కథనం