Long hair world record : తమ జుట్టు పొడవుగా ఉండాలని చాలా మంది మహిళలు భావిస్తారు. ఈ విషయంలో ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ.. ఓ అడుగు ముందుకేసింది! ఏకంగా.. 7 అడుగుల 9 ఇంచ్‌ల జుట్టును పెంచి వరల్డ్ రికార్డ్‌ను సృష్టించింది.
ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన స్మిత శ్రీవాస్తవ వయస్సు 46ఏళ్లు. ఆమెకు 7 అడుగుల 9ఇంచుల పొడవైన జుట్టు ఉంది. 14ఏళ్ల నుంచి దానిని పెంచుతూ వస్తోంది.
1980 దశకంలో చాలా మంది హీరోయిన్లకు పొడవాటి జుట్టు ఉండేది. వారి నుంచి స్ఫూర్తి పొందారు స్మిత. ఆమె తల్లి కూడా ప్రోత్సహించడంతో.. ఇక జట్టును పెంచాలని నిర్ణయించుకున్నారు. 14ఏళ్ల వయస్సు నుంచి ఒక్కసారి కూడా జుట్టును కట్ చేయలేదట!
"భారతీయ సంస్కృతిలో దేవతల్లో చాలా మందికి పొడవాటి జుట్టు ఉంటుంది. మహిళలు, జుట్టును కత్తిరించడం అనేది అశుభంగా భావిస్తారు. అందుకే మహిళలు పొడవైన జుట్టును పెంచుతారు. పొడవాటి జుట్టుతో మహిళల అందం కూడా పెరుగుతుంది," అని స్మిత అన్నారు.
UP woman long hair : గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం.. స్మిత తన పొడవాటి జుట్టును వారంలో రెండుసార్లు వాష్ చేస్తారు. టవల్‌తో డ్రై చేస్తారు. ఆ తర్వాత జుట్టును స్టైల్ చేస్తారు.
ఇక తనకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లభించడంతో చాలా సంతోషంగా ఉందన్నారు స్మిత. "దేవుడు నా ప్రార్థనలను విన్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది," అని ఆమె అన్నారు.
పొడవాటి జుట్టుతో.. వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్‌ని పట్టుకుని నిలబడిన స్మితకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌కు విపరీతమైన లైక్స్ వస్తున్నాయి. చాలా మంది కామెంట్లు కూడా పెడుతున్నారు.
Long hair viral video : "అంత జుట్టు పెంచడానికి ఆమె ఏం ప్రాడక్ట్స్ వాడారో నాకు తెలుసుకోవాలని ఉంది," అని ఒకరు కామెంట్ పెట్టగా.. "ఇంత పొడవైన జట్టు, ప్రతి మహిళ కల" అని ఇంకొకరు రాసుకొచ్చారు. గిన్నిస్ రికార్డ్‌ను సంపాదించినందుకు.. చాలా మంది స్మితను అభినందిస్తున్నారు.
సంబంధిత కథనం