గ్రామ పంచాయతీ కూడా చేతులెత్తేసిన కేసును ఓ 'గేదె' పరిష్కరించింది!-up viral news a buffalo solved a problem that a village panchayat couldnt ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  గ్రామ పంచాయతీ కూడా చేతులెత్తేసిన కేసును ఓ 'గేదె' పరిష్కరించింది!

గ్రామ పంచాయతీ కూడా చేతులెత్తేసిన కేసును ఓ 'గేదె' పరిష్కరించింది!

Sharath Chitturi HT Telugu
Jul 06, 2024 12:25 PM IST

UP viral new : యూపీలో ఓ గేదె, ఓ కేసును పరిష్కరించింది! ఇదెలా సాధ్యం? అనుకుంటున్నారా? అసలు విషయానికి వస్తే..

ఇది ఒక గేదె పరిష్కరించిన కేసు..
ఇది ఒక గేదె పరిష్కరించిన కేసు..

యూపీలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు వైరల్​గా మారింది. గ్రామ పంచాయతీ కూడా పరిష్కరించలేని ఓ కేసును, ఓ గేదె పరిష్కరించింది! అసలు విషయం ఏంటంటే..

ఇదీ జరిగింది..

ఉత్తర్​ప్రదేశ్​ ప్రతాప్​గఢ్​లోని రాయ్​ అక్షరన్​పూర్​ గ్రామానికి చెందిన నంద్​లాల్​ సరోజ్ దగ్గర చాలా గేదెలు ఉన్నాయి. వాటిలో ఒక గేదె కొన్ని రోజుల క్రితం తప్పిపోయింది. నడుచుకుంటూ, నడుచుకుంటూ పూరే హరికేశ్​ గ్రామానికి వెళ్లింది. గ్రామానికి చెందిన హనుమాన్​ సరోజ్​ అనే వ్యక్తి, ఆ గేదెను పట్టుకున్నాడు. పెంచుకోవడం మొదలుపెట్టాడు.

కానీ తన గేదె తప్పిపోవడంతో ఆందోళనకు గురైన నంద్​లాల్​, దాని కోసం గాలించడం మొదలుపెట్టాడు. మూడు రోజుల తీవ్ర గాలింపు అనంతరం గేదెను హనుమాన్​ దగ్గర గుర్తించాడు. ఆ గేదె తనదేనని, తిరిగి ఇచ్చాయాలని చెప్పాడు. కానీ హనుమాన్​ వినలేదు. అది తన గేదె అని బుకాయించాడు. చివరికి ఈ వ్యవహారం పంచాయతీ పెద్దల దగ్గరికి వెళ్లింది.

గేదె ఎవరిది? అన్న విషయంపై గంటలు గంటలు చర్చలు జరిగాయి. కానీ ఒక ఈ సమస్యకు పరిష్కారం దక్కలేదు. ఇద్దరూ, ఆ గేదె తమదేనని పట్టుబట్టారు. ఫలితంగా గ్రామ పెద్దలే తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇదీ చూడండి:- Thief leaves note: ‘‘దొంగతనం చేసి, క్షమించమని నోట్ పెట్టి..’’-

ఈ వ్యవహారం మహేశ్​గంజ్​ పోలీస్​ స్టేషన్​కి చేరింది. జరిగినది పూర్తిగా విన్న ఎస్​హెచ్​ఓ శ్రవణ్​ కుమార్​.. సమస్యకు ఒక పరిష్కారాన్ని వివరించారు.

"గెదే ఎవరికి చెందుతుందో దానిని నిర్ణయించుకోనివ్వండి," అని అన్నారు. ఆ గేదెను పోలీస్​ స్టేషన్​ దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఒక రోడ్డు దగ్గరికి తీసుకెళ్లారు. నంద్​లాల్​, హనుమాన్​లను వారివారి గ్రామాల డైరక్షన్​లో నిలబడాలని అధికారులు సూచించారు.

చివరికి ఆ గేదె, నడుచుకుంటూ.. తన యజమాని నంద్​లాల్​వైపు వెళ్లింది. అలా, ఈ సమస్యకు పరిష్కారం లభించింది. ఉత్కంఠకు తెరపడింది. గేదె తన విశ్వాసాన్ని చాటుకుంది.

మరోవైపు గేదె తనదేనని ఇంతసేపు బుకాయించిన హనుమాన్​ను పోలీసులు, గ్రామస్థులు మందలించి విడిచిపెట్టారు.

ఈ వార్త సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఈ కథ విన్నవారందరూ అధికారి చేసిన పనికి మెచ్చుకుంటున్నారు. గేదెను కూడా పొగుడుతున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం