Police dog solves murder case : మర్డర్ కేసును 48 గంటల్లో ఛేదించిన శునకం!
Police dog solves murder case : యూపీ పోలీసులకు చెందిన కే9 శునకం జానీ.. మర్డర్ కేసును 48గంటల్లో ఛేదించింది. 22కి.మీల దూరంలో ఉన్న దొంగలించిన ట్రాక్టర్ వద్దకు పోలీసులను తీసుకెళ్లింది.
Police dog solves murder case in 48 hours : ఎక్కడ ఏం జరిగినా.. శునకాలు ఇట్టే పసిగట్టేస్తాయి! ఇక పోలీసు శునకాలకు ఈ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి కథే 'జానీ' అనే జర్మన్ షెపర్డ్ది. ఈ కే9 శునకం.. 48 గంటల్లోనే ఓ మర్డర్ మిస్టరీని ఛేదించింది. అందరి ప్రశంసలు అందుకుంటోంది.
ట్రెండింగ్ వార్తలు
ఇదీ జరిగింది..
పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్ కస్గంజ్లో ఓ 15ఏళ్ల బాలుడు.. దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు.. అతడి ట్రాక్టర్‌తో పాటు కొంత నగదును దోచుకుని పారిపోయారు.
ఈ వ్యవహారం పోలీసుల దృష్టికి వచ్చింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. జానీ సాయం తీసుకున్నారు. జానీ అంటే.. పోలీసు శునకం. ఇది ఒక జర్మన్ షెపర్డ్.
పోలీసుల నమ్మకాన్ని జానీ వమ్ము చేయలేదు. నిందితులను కేవలం 48 గంటల్లో పట్టుకుని.. అందరి చూపును తనవైపు తిప్పుకుంది.
"మా కే9 ఆఫీసర్ జానీకి సెల్యూట్. ఎలాంటి క్లూస్ లేని మర్డర్ మిస్టరీని జానీ 48గంటల్లో ఛేదించింది. గొప్ప డిటెక్టివ్ అని నిరూపించుకోవడంతో పాటు.. 22కిలోమీటర్ల దూరంలో పార్కు చేసిన ట్రాక్టర్‌ను పసిగట్టేసింది," అని యూపీ పోలీసులు ట్వీట్ చేశారు.
పోలీసులు ట్వీట్ చేసిన దాంట్లో ఓ వీడియో ఉంది. వీడియోలో.. 15ఏళ్ల బాలుడి మృతదేహం, కేసును జానీ ఛేదించిన తీరుకు సంబంధించిన దృశ్యాలు ఉన్నాయి.
ఈ కేసుకు సంబంధించి ఆకాశ్ చౌహాన్, ధీరేంద్ర, రాహుల్ చౌహాన్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులకు సాయం చేసి, కేసును 48 గంటల్లో ఛేదించిన జానీ, దానిని చూసుకునే రామ్‌ప్రకాశ్ సింగ్, అనురాగ్‌లను యూపీ పోలీసులు అభినందించారు. లెటర్ ఆఫ్ అప్రీసియేషన్ను అందించారు.
అంతేకాకుండా.. కస్గంజ్ ఎస్పీ మూర్తి.. కే9 శునకానికి సెల్యూట్ కూడా చేశారు.
జానీ కథ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. యూపీ పోలీసులు చేసిన ట్వీట్‌ను ఇక్కడ చూడండి:
సంబంధిత కథనం
Army assault dog Zoom dies: సాహస శునకం ‘జూమ్’ కన్నుమూత
October 13 2022
Pet Dogs : మనుషుల విశ్వాసం ఇదే.. మీకు అర్థమయిందా?
October 11 2022