UP Dy CM on Adipurush teaser: ఆదిపురుష్ టీజర్‌పై యూపీ డిప్యూటీ సీఎం కామెంట్-up deputy cm on adipurush teaser ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Up Deputy Cm On Adipurush Teaser

UP Dy CM on Adipurush teaser: ఆదిపురుష్ టీజర్‌పై యూపీ డిప్యూటీ సీఎం కామెంట్

HT Telugu Desk HT Telugu
Oct 05, 2022 10:56 AM IST

UP Dy CM on Adipurush teaser: ఆదిపురుష్ టీజర్‌పై యూపీ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ కామెంట్ చేశారు.

ఇటీవల అయోధ్యలో రామమందిరాన్ని సందర్శించిన ఆది పురుష్ టీమ్ సభ్యులు ప్రభాస్, కృతిసనన్
ఇటీవల అయోధ్యలో రామమందిరాన్ని సందర్శించిన ఆది పురుష్ టీమ్ సభ్యులు ప్రభాస్, కృతిసనన్ (ANI)

లక్నో: ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ వివాదాన్ని ప్రస్తావిస్తూ, హిందూ దేవుళ్లను అగౌరవపరచడాన్ని ఎప్పటికీ సహించబోమని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు

‘రాముడు హిందూ సంస్కృతి గుండెలో ఉన్నాడు. సనాతన ధర్మాన్ని అగౌరవపరిచే ఏ చర్యనూ సహించబోం. భారతదేశంలోని ప్రజలు తమ జీవితాంతం పుట్టినప్పటి నుండి మరణించే వరకు శ్రీరాముని పేరును జపిస్తారు..’ అని ఆయన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.

సంస్కృతి మార్చాల్సిన అవసరం లేదన్నారు. సినిమాలో హనుమంతుడిని చూపించిన విధానం, రావణుడి రూపాన్ని పాఠక్ ఎత్తిచూపారు.

రావణుడిని రాముడు చంపాడని చూపినప్పటికీ, రావణుడు బ్రాహ్మణుడు అని సినిమాలో చూపడాన్ని సాధువులు కూడా వ్యతిరేకించారు. సాధువుల ప్రకటనలను ప్రస్తావిస్తూ పాఠక్ ‘ఎప్పుడూ సాధువులు చెప్పేవాటిపై శ్రద్ధ అవసరం. సినిమాలు తరచుగా హిందువుల మనోభావాలపై దాడి చేస్తాయి. మన సంస్కృతిపై దాడి జరిగినప్పుడల్లా ఈ సాధువులు, అఖాడాలే మన సంస్కృతిని కాపాడారు. మన సంస్కృతి గురించి మేం గర్విస్తున్నాం..’ అని పేర్కొన్నారు.

సినిమాలో హనుమంతుడి గెటప్ గురించి పాఠక్ ‘మన సంస్కృతిని మార్చడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి..’ అని వ్యాఖ్యానించారు. సినిమాలో రావణుడి గెటప్ కూడా మార్చాలని వ్యాఖ్యానించారు.

WhatsApp channel