Uma Bharti: ‘ఆధారాలున్నాయి.. కాశీ, మథురలో కూడా ఆలయాలు నిర్మించాలి’: ఉమాభారతి-unlike ayodhya there is enough proof in kashi and mathura bjps uma bharti ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Uma Bharti: ‘ఆధారాలున్నాయి.. కాశీ, మథురలో కూడా ఆలయాలు నిర్మించాలి’: ఉమాభారతి

Uma Bharti: ‘ఆధారాలున్నాయి.. కాశీ, మథురలో కూడా ఆలయాలు నిర్మించాలి’: ఉమాభారతి

HT Telugu Desk HT Telugu
Mar 02, 2024 01:47 PM IST

Kashi and Mathura: అయోధ్యలో వివాదాస్పద మసీదు ప్రాంగణంలో గతంలో ఆలయం ఉన్నట్లుగా నిర్ధారించడానికి తవ్వకాలు జరపాల్సి వచ్చిందని బీజేపీ ఎంపీ ఉమాభారతి గుర్తు చేశారు. కానీ, కాశీ, మథురలో గతంలో ఆలయాలు ఉన్నట్లుగా ఇప్పటికే ఆధారాలు స్పష్టంగా ఉన్నాయని ఆమె వివరించారు.

అయోధ్య రామ మందిరం వద్ద బీజేపీ ఎంపీ ఉమా భారతి
అయోధ్య రామ మందిరం వద్ద బీజేపీ ఎంపీ ఉమా భారతి (PTI)

Uma Bharti: అయోధ్య లో నిర్మించిన తరహాలోనే కాశీలో, మథురలో ఆలయాలు నిర్మించాలని, తద్వారా అయోధ్య మాదిరిగానే కాశీ, మథురలకు కూడా తమకు దక్కాల్సిన హక్కులు లభిస్తాయని బీజేపీ నాయకురాలు ఉమాభారతి డిమాండ్ చేశారు. అయోధ్యలో సాక్ష్యాధారాలను తవ్వకాలు జరిపి సాధించాల్సి వచ్చినందువల్ల ఆందోళనలు చెలరేగాయని, అయితే, కాశీ, మథురలో తవ్వకాలు జరపాల్సిన అవసరం లేదని ఆమె వివరించారు. కాశి, మథురల్లో అన్ని ఆధారాలు కళ్లకు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు.

1991లోనే అడిగాను..

అయోధ్య (Ayodhya), మథుర (Mathura), కాశీ (Varanasi) లలోని వివాదాస్పద ప్రదేశాలను హిందువులకు అప్పగించాలని 1991లోనే తాను పార్లమెంటులో ప్రతిపాదించానని రామ మందిర ఉద్యమంలో ప్రధాన పాత్రధారుల్లో ఒకరైన ఉమాభారతి చెప్పారు. జ్ఞానవాపి వ్యవహారంపై వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించిన ఉమా భారతి.. 1993లో జ్ఞానవాపి గోడలపై చెక్కి ఉన్న విగ్రహాలను తాను పూజించి విషయాన్ని గుర్తు చేశారు. కాశి, మథుర ఆలయాల విషయంలో ముస్లింలకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే వారికి కోర్టుకు వెళ్లే హక్కు ఉందని ఉమా భారతి వ్యాఖ్యానించారు.

అభ్యంతరాలు ఉంటే కోర్టుకు వెళ్లొచ్చు..

కోర్టు ఇచ్చిన ఆదేశాలను అంతా పాటిస్తామని చెప్పారు. ‘‘వారణాసి జిల్లా కోర్టు తీర్పు తరువాత, అయోధ్య మాదిరిగా, మథుర, కాశీల్లో గతంలో ఆలయాలు ఉన్న ప్రదేశాలలో ఆలయాలను నిర్మించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఆ ప్రదేశాల్లో కొత్తగా నిర్మించిన ఆలయాల్లో హిందువులకు పూజలు చేసుకునే హక్కును ఇవ్వాలని నేను మళ్లీ అభ్యర్థిస్తున్నాను. ఈ స్థలాలను హిందువులకు అప్పగించండి, ఇది సరైన పరిష్కారం’’ అని ఆమె అన్నారు. కాశీ విశ్వనాథ ఆలయం పక్కన ఉన్న మసీదు ఆలయ అవశేషాలపై నిర్మించబడిందో లేదో తెలుసుకోవడానికి అవసరమైన చోట తవ్వకాలతో సహా "సమగ్ర శాస్త్రీయ సర్వే" నిర్వహించాలని వారణాసి జిల్లా కోర్టు గత సంవత్సరం జూలై 21 న భారత పురావస్తు శాఖను ఆదేశించిన విషయం తెలిసిందే.

Whats_app_banner