‘Unite or die’ - Rishi Sunak's message: ‘‘కఠిన నిర్ణయాలు తప్పదు’’
‘Unite or die’ - Rishi Sunak's message: బ్రిటన్ కొత్త ప్రధానిగా భారత సంతతికి చెందిన రుషి సునక్ ఎంపిక లాంఛనం ముగిసింది. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ ను రుషి సునక్ మంగళవారం కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆయన నుంచి అనుమతి పొందారు.
‘Unite or die’ - Rishi Sunak's message: పట్టాలు తప్పిన బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ ను మళ్లీ గాడిన పట్టడానికి బ్రిటన్ కొత్త ప్రధాని రుషి సునక్ చర్యలు ప్రారంభించారు.
‘Unite or die’ - Rishi Sunak's message: కఠిన నిర్ణయాలు
దేశ ఆర్థిక వ్యవస్థ ను సంక్షోభం నుంచి బయటపడవేయడానికి కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని రుషి సునక్ స్పష్టం చేశారు. పీఎం గా బాధ్యతలు తీసుకున్న అనంతరం రుషి సునక్ మొదట కేబినెట్ కూర్పుపై దృష్టి పెట్టనున్నారు. ఆ తరువాత, ఆర్థిక రంగానికి సంబంధించిన కీలక నిర్ణయాలను ప్రకటిస్తారని సమాచారం. ఆర్థిక మంత్రిగా జెరెమీ హంట్ ను కొనసాగించే అవకాశాలున్నాయని సమాచారం.
‘Unite or die’ - Rishi Sunak's message: యువ ప్రధాని
కొత్త పీఎం గా బాధ్యతలు చేపట్టిన 42 ఏళ్ల రుషి సునక్ బ్రిటన్ కు అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా రికార్డు సృష్టించారు. అలాగే, బ్రిటన్ పీఎం పీఠం అధిష్టించిన తొలి దక్షిణిసియాకు చెందిన వ్యక్తి కూడా.
‘Unite or die’ - Rishi Sunak's message: యునైట్ ఆర్ డై (unite or die)
ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న రుషి సునక్ సొంత పార్టీ అయిన కన్సర్వేటివ్ పార్టీ నేతలతో మంగళవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కలిసి సాగడమా? లేక నాశనమవ్వడమా? అనే రెండు ఆప్షన్లు మాత్రమే మనముందున్నాయని ఈ సందర్భంగా వారికి చెప్పారు.