Mercy killing: ‘‘మా కుటుంబం అంతా స్వచ్ఛంధంగా చనిపోవడానికి అనుమతించండి’’- సుప్రీంకోర్టును కోరనున్న దంపతులు-unable to treat their 2 childrens health problem family of 5 in kerala to approach sc for mercy killing ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Unable To Treat Their 2 Children's Health Problem, Family Of 5 In Kerala To Approach Sc For Mercy Killing

Mercy killing: ‘‘మా కుటుంబం అంతా స్వచ్ఛంధంగా చనిపోవడానికి అనుమతించండి’’- సుప్రీంకోర్టును కోరనున్న దంపతులు

HT Telugu Desk HT Telugu
Jan 27, 2024 08:41 PM IST

mercy killing: పుట్టుకతో వచ్చే అరుదైన వ్యాధితో బాధపడుతున్న తమ ఇద్దరు పిల్లలకు చికిత్స కొనసాగించలేకపోతున్నామని, అందువల్ల, తమ కుటుంబంలోని మొత్తం ఐదుగురు చనిపోవడానికి అనుమతించాలని కేరళలోని ఒక కుటుంబం సుప్రీకోర్టును ఆశ్రయించనుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Image for representation)

కేరళలోని కొట్టాయం జిల్లా కోజువనాల్ కు చెందిన ఓ కుటుంబం తమ కుటుంబంలోని ఐదుగురికి కారుణ్య మరణం ప్రసాదించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని యోచిస్తోంది. అరుదైన పుట్టుకతో వచ్చే వ్యాధితో బాధపడుతున్న తమ ఇద్దరు పిల్లలకు చికిత్స కొనసాగించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని, ఆర్థికంగా కూడా చితికిపోయామని ఆ పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

అరుదైన వ్యాధి

సాల్ట్ వేస్టింగ్ కంజెనిటల్ అడ్రినల్ హైపర్ ప్లాసియా (SWCAH) తో బాధపడుతున్న తమ ఇద్దరికి చికిత్సను కొనసాగించడానికి అవకాశం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్మితా ఆంటోనీ, మను జోసెఫ్ దంపతులు తెలిపారు. ముఖ్యమైన హార్మోన్లను ఉత్పత్తి చేసే అడ్రినల్ గ్రంధి పనితీరును దెబ్బతీసే సాల్ట్ వేస్టింగ్ కంజెనిటల్ అడ్రినల్ హైపర్ ప్లాసియా వ్యాధి అత్యంత అరుదైనది. ఇది జన్యుపరమైన వ్యాధి. అంతేకాదు, దీని చికిత్సకు భారీగా ఖర్చు అవుతుంది.

ఆర్థికంగా చితికిపోయాం..

తాను, తన భర్త వృత్తిరీత్యా నర్సులమని, అయితే తమ పిల్లలకు పూర్తి సమయం సంరక్షణ అవసరం కావడంతో తాము పనికి వెళ్లలేకపోయామని స్మిత చెప్పారు. కొట్టాయంలో విలేకరులతో మాట్లాడిన స్మిత తమ పిల్లల వైద్య ఖర్చుల కోసం ఇప్పటికే తమ ఆస్తుల్లో కొన్నింటిని విక్రయించామని, మరికొన్నింటిని తాకట్టు పెట్టామని చెప్పారు. ‘‘రోజువారీ ఖర్చుల కోసం, చిన్న పిల్లల వైద్యం కోసం, పెద్ద వాడి చదువు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఆదాయం లేకపోవడంతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోతున్నాం’’ అని స్మిత పేర్కొన్నారు.

స్థానిక పంచాయతీలో..

ఆర్థిక సాయంతో పాటు చిన్న ఉద్యోగమేదైనా ఇవ్వాలని కోరుతూ స్థానిక పంచాయతీని సంప్రదించామని, కాని ఎలాంటి సహకారం అందించలేదని ఆమె వెల్లడించారు. కొంతకాలం క్రితం పంచాయతీ కమిటీ ఏకగ్రీవంగా తనకు ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ, ఆ నిర్ణయానికి సంబంధించి అవసరమైన పత్రాలను ప్రభుత్వానికి పంపడంలో కార్యదర్శి ఆలస్యం చేశారని ఆమె పేర్కొన్నారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఏమీ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సుప్రీంకోర్టుకు..

మానవహక్కుల సంఘం జోక్యం చేసుకున్న తర్వాత పంచాయతి కార్యదర్శి ఫైలును ప్రభుత్వానికి పంపినప్పటికీ, హామీ ఇచ్చిన ఉద్యోగంపై ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆమె వివరించారు. ఇప్పుడు తమవద్ద పిల్లల చికిత్స కోసం డబ్బులు లేవని, ఈ పరిస్థితుల్లో చనిపోవడం తప్ప మరో మార్గం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే కారణ్య మరణానికి అనుమతించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నామన్నారు.

IPL_Entry_Point