World water day: ప్రపంచంలో తాగడానికి స్వచ్ఛమైన నీరు కూడా దొరకని వారెందరో తెలుసా?-un 26 of world lacks clean drinking water 46 sanitation ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Un: 26% Of World Lacks Clean Drinking Water, 46% Sanitation

World water day: ప్రపంచంలో తాగడానికి స్వచ్ఛమైన నీరు కూడా దొరకని వారెందరో తెలుసా?

HT Telugu Desk HT Telugu
Mar 22, 2023 05:43 PM IST

World water day special: నాణేనికి ఒకవైపు అభివృద్దిలో దూసుకుపోతున్న ప్రపంచం.. అదే నాణేనికి మరోవైపు తాగడానికి సరైన, స్వచ్ఛమైన నీరు కూడా దొరకని దీన ప్రపంచం. ఈ వైరుద్ధ్యాన్ని ఐక్యరాజ్య సమితి నివేదిక ఒకటి ప్రపంచ నీటి దినోత్సవం (World water day) సందర్భంగా తేటతెల్లం చేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

World water day special: ప్రపంచ నీటి దినోత్సవం (World water day) సందర్భంగా ఐక్యరాజ్య సమితి ఒక నివేదిక విడుదల చేసింది. యూఎన్ కాన్ఫెరెన్స్ ఆన్ వాటర్ (U.N. conference on water) 45 ఏళ్ల తరువాత విడుదల చేసిన నివేదిక ఇది.

ట్రెండింగ్ వార్తలు

World water day special: 26% మందికి నీరులేదు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాలో 26 శాతం మందికి స్వచ్ఛమైన తాగునీటి సదుపాయం లేదని ఐరాస నివేదిక తేల్చింది. అలాగే, ప్రపంచవ్యాప్తంగా 46% మందికి కనీస పారిశుద్ధ్య సౌకర్యం లేదని తెలిపింది. అంటే, ప్రపంచంలో సగం మందికి సరైన పారిశుద్ధ్య సౌకర్యం, ప్రపంచంలో పావు భాగం మందికి స్వచ్చమైన తాగునీరు కరువయ్యాయని యూఎన్ వరల్డ్ వాటర్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2023 (U.N. World Water Development Report 2023) పేరుతో రూపొందిన ఐరాస నివేదిక తేల్చింది. 2030 నాటికి ప్రపంచంలోని అందరికీ స్వచ్చమైన తాగునీరు, అందరికీ కనీస పారిశుద్ధ్య సౌకర్యం లభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

World water day special: లక్ష కోట్ల ఖర్చు

ఈ లక్ష్యాలను చేరుకోవడానికి 600 బిలియన్ డాలర్ల నుంచి 1 ట్రిలియన్ ( లక్ష కోట్లు) డాలర్ల వరకు ఖర్చు అవుతుందని ఈ నివేదికను రూపొందించిన రిచర్డ్ కానర్ అంచనా వేశారు. ఈ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు, స్వచ్ఛంధ సంస్థలు, పర్యావరణ పరిరక్షణ సంస్థలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు కలిసి రావాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా నీటి వినయోగం ఏటా 1% పెరుగుతోందని, గత 40 ఏళ్లుగా ఇలా నీటి వినియోగంలోపెరుగుదల నమోదవుతుందని రిచర్డ్ కానర్ వివరించారు. జనాభాలో పెరుగుదల, సామాజిక, ఆర్థిక అభివృద్ధి, మారుతున్న అలవాట్ల కారణంగా ఈ పెరుగుదల నమోదవుతోందన్నారు

World water day special: వ్యవసాయానికే ఎక్కువ

‘ప్రపంచంలో వినియోగమవుతున్న నీటిలో దాదాపు 70% వ్యవసాయానికే వినియోగమవుతోంది. వ్యవసాయంలో నీటి వినియోగాన్ని తగ్గించే దిశగా చర్యలు చేపట్టాలి. డ్రిప్ ఇరిగేషన్ వంటి విధానాలను ప్రోత్సహించాలి’ అని కానర్ వివరించారు. వాతావరణ మార్పుల కారణంగా ఇప్పుడు నీరు సమృద్ధిగా దొరికిన ప్రాంతాల్లో కూడా భవిష్యత్తులో నీరు కనిపించకుండా పోయే ప్రమాదం ఉందన్నారు.

IPL_Entry_Point