Russia Ukraine Crisis | ఉక్రెయిన్ ఎయిర్ స్పేస్ క్లోజ్.. ఇండియా విమానంపై ఉత్కంఠ-ukrainian airspace closed ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్

Russia Ukraine Crisis | ఉక్రెయిన్ ఎయిర్ స్పేస్ క్లోజ్.. ఇండియా విమానంపై ఉత్కంఠ

HT Telugu Desk HT Telugu
Feb 28, 2022 10:12 AM IST

ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్య ప్రారంభం కావడంతో ఉక్రెయిన్‌లో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తూర్పు ఉక్రెయిన్‌లో సైనిక చర్యకు అధికారం ఇచ్చిన తర్వాత స్థానిక నివాసితులు గ్యాస్ స్టేషన్‌లో ఇంధనం నింపుకోవడం కనిపించింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తూర్పు ఉక్రెయిన్‌లో సైనిక చర్యకు అధికారం ఇచ్చిన తర్వాత స్థానిక నివాసితులు గ్యాస్ స్టేషన్‌లో ఇంధనం నింపుకోవడం కనిపించింది. (REUTERS)

ట్రెండింగ్ వార్తలు

రష్యా దాడిని ఎదుర్కొంటున్న తూర్పు యూరోపియన్ దేశం నుండి భారతీయులను తిరిగి తీసుకురావడానికి ఎయిర్ ఇండియా విమానం గురువారం ఉదయం ఉక్రెయిన్‌కు బయలుదేరింది.

అయితే ఉక్రెయిన్ అధికారులు గురువారం ఉదయం పౌర విమానాల కార్యకలాపాల కోసం దేశ గగనతలాన్ని మూసివేసినందున ఎయిర్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం విమానాన్ని తిరిగి పిలవాలా లేదా దాని ప్రయాణాన్ని కొనసాగించాలా అని ఆలోచిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఎయిర్ ఇండియా విమానం AI 1947 ఇక్కడి ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉదయం 7.30 గంటలకు కీవ్‌లోని బోరిస్పిల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరింది.

ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ప్రకారం విమానం దాదాపు ఆరు గంటల్లో అక్కడికి చేరుకుంటుంది.

కాగా గురువారం ఉదయం 7.45 గంటల ప్రాంతంలో కీవ్ నుంచి వచ్చిన ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ విమానం ఢిల్లీ విమానాశ్రయంలో దిగింది.

‘విమానంలో 182 మంది భారతీయులు ఉన్నారు. వారిలో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. మరికొన్ని విమానాలు షెడ్యూల్ అయ్యాయి..’ అని ఎస్‌టీఐసీ గ్రూప్ డైరెక్టర్ అంజు వారియా తెలిపారు. ఈ బృందం భారతదేశంలోని ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ కోసం జనరల్ సేల్స్ ఏజెంట్‌గా వ్యవహరిస్తోంది.

కొద్ది వారాలుగా పెరుగుతున్న ఉద్రిక్తతల తర్వాత రష్యా గురువారం ఉక్రెయిన్‌పై సైనిక చర్యను ప్రకటించింది.

ఉక్రెయిన్ అధికారులు వైమానిక సిబ్బందికి నోటీసు జారీ చేశారు. పౌర విమానయానానికి పొంచి ఉన్న ప్రమాదం కారణంగా ఉక్రెయిన్ లోపల నడిచే విమానాలను పరిమితం చేయాలని నోటీసులో పేర్కొన్నారు.

కీవ్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించి త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు భారత ప్రభుత్వ అధికారులు తెలిపారు.

ఎయిర్ ఇండియా విమానం తూర్పు యూరోపియన్ దేశం నుంచి భారతీయులను తిరిగి తీసుకురావడానికి విమానయాన సంస్థ నిర్వహిస్తున్న రెండవ విమానం. మొదటి విమానం ఫిబ్రవరి 22 న వెళ్లి సుమారు 240 మందిని తిరిగి తీసుకువచ్చింది.

ఎయిరిండియా ఫిబ్రవరి 22, 24, 26 తేదీలలో భారతదేశం, ఉక్రెయిన్ మధ్య మూడు విమానాలను నడపనున్నట్లు ప్రకటించింది.

వైమానిక దళం సిద్ధం..

న్యూఢిల్లీలోని అధికారులు ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. అన్ని అత్యవసరల పరిస్థితుల కోసం భారత వైమానిక దళాన్ని సిద్ధంగా ఉంచారు.

భారతీయ విద్యార్థుల భద్రత ఇప్పుడు భారత ప్రభుత్వ ప్రాధాన్యతగా ఉంది. ఎయిర్ ఇండియా నిర్వహిస్తున్న ప్రత్యేక విమానాలు, ఇతర క్యారియర్‌ల విమానాల ద్వారా రావడానికి వారిని ఇంతకుముందు కీవ్‌కు రావాలని కోరారు. 

ఉక్రెయిన్‌లో సైనిక కార్యకలాపాలకు రష్యా అధికారం ఇవ్వడానికి కొద్దిసేపటి ముందు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ప్రత్యేక సెషన్‌లో భారతదేశ శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి మాట్లాడుతూ ఉక్రెయిన్‌లోని తన పౌరుల భద్రత, తిరిగి రావడానికి దేశం అందించిన ప్రాధాన్యతను నొక్కి చెప్పారు.

‘విద్యార్థులతో సహా 20,000 మందికి పైగా భారతీయ పౌరులు ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతాలతో సహా వివిధ ప్రాంతాల్లో ఉన్నారని నేను మరోసారి నొక్కి చెబుతున్నాను. అవసరమైన మేరకు భారతీయ విద్యార్థులతో సహా భారతీయ పౌరులందరికీ తిరిగి రావడానికి మేం సదుపాయం కల్పిస్తున్నాం..’ ”అని ఆయన చెప్పారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్