UK visa news: యూకే లోని ఇండియన్ స్టూడెంట్స్ కు శుభవార్త-uk visa now students can switch to work visa even before finishing college ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Uk Visa: Now, Students Can Switch To Work Visa Even Before Finishing College

UK visa news: యూకే లోని ఇండియన్ స్టూడెంట్స్ కు శుభవార్త

HT Telugu Desk HT Telugu
Dec 29, 2022 08:04 PM IST

UK visa news: యూకేలో ఇప్పటికే విద్యను అభ్యసిస్తున్న, లేదా అక్కడ ఉన్నత విద్య లో చేరాలనుకుంటున్న విద్యార్థులకు శుభవార్త.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (AP)

UK visa news: విదేశాల్లో విద్యకు సంబంధించి అమెరికా తరువాత భారతీయుల తదుపరి ప్రధాన గమ్యం యూకేనే. బ్రిటన్ లో నాణ్యమైన విద్యను అందించే ప్రపంచ స్థాయి ప్రమాణాల యూనివర్సిటీలు ఉండడంతో పాటు, విద్యార్థి అనుకూల విధానాలు కూడా అందుకు ముఖ్య కారణాలు.

ట్రెండింగ్ వార్తలు

UK work visa news: వర్క్ వీసాకు ఈజీగా మారొచ్చు..

తాజాగా విదేశీ విద్యార్థులకు అత్యంత ప్రయోజనం చేకూర్చే నిర్ణయాన్ని బ్రిటన్(Britain) ప్రభుత్వం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల ఇతర విదేశీ విద్యార్థులతో పాటు, భారతీయ విద్యార్థులు ప్రధానంగా ప్రయోజనం పొందుతారు. బ్రిటన్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం.. ఇకపై, విదేశీ విద్యార్థులు తమ కోర్సు పూర్తి చేయడానికి ముందే ఉద్యోగం చేసుకోవడానికి వీలుగా, వర్క్ వీసా (work visa) కు మారొచ్చు. ఇప్పటివరకు, చేస్తున్న డిగ్రీ(graduation) పూర్తై, సర్టిఫికెట్ పొందిన తరువాత కానీ, వర్క్ వీసాకు (work visa) మారడానికి వీల్లేకుండా ఉండేది. ఇకపై ఆ నిబంధనను మార్చి, డిగ్రీ పూర్తి చేయడానికి ముందే, విదేశీ విద్యార్థులు వర్క్ వీసా (work visa) కు మారేలా అవకాశం కల్పించారు.

UK visa news: రెండు వైపులా ప్రయోజనం

ఈ నిర్ణయం వల్ల ఇటు విదేశీ విద్యార్థులకు, అటు బ్రిటన్ ప్రభుత్వానికి ప్రయోజనం కలుగుతుందని వీసా, ఇమ్మిగ్రేషన్(visa, immigration) నిపుణులు భావిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే విద్యార్థులు ప్రధాన అడ్డంకిగా భావించే ఈ నిబంధనను తొలగించడం వల్ల ఎక్కువ మంది విద్యార్థులు బ్రిటన్ వర్సిటీల్లో(Britain universities) చేరే అవకాశముంటుందని, అలాగే, ప్రస్తుతం బ్రిటన్ ఎదుర్కొంటున్న నిపుణులైన ఉద్యోగుల కొరత కూడా తీరుతుందని వివరిస్తున్నారు. కొరోనా అనంతరం, బ్రిటన్ ను నిపుణులైన ఉద్యోగుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. అవసరమైన, ఇతర నైపుణ్యాలు ఉన్న విద్యార్థులకు, డిగ్రీ పూర్తి కాకుండానే, వర్క్ వీసా (work visa) కు అనుమతినివ్వడం వల్ల ఉద్యోగుల కొరతకు సంబంధించిన సమస్య కూడా తీరుతుంది. వారు డిగ్రీ పూర్తయిన తరువాత వెళ్లిపోకుండా, ఇక్కడే దేశాభివృద్ధికి తోడ్పడే అవకాశముంటుంది.

IPL_Entry_Point

టాపిక్