UK murderer admits abusing 101 dead women; మృతదేహాలపై లైంగిక దాడి; సైకో వికృతం-uk murderer admits abusing a total of 101 dead women ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Uk Murderer Admits Abusing A Total Of 101 Dead Women

UK murderer admits abusing 101 dead women; మృతదేహాలపై లైంగిక దాడి; సైకో వికృతం

HT Telugu Desk HT Telugu
Nov 03, 2022 05:55 PM IST

UK murderer admits abusing 101 dead women; ఇంగ్లండ్ లో డేవిడ్ ఫుల్లర్ అనే ఒక నరరూప రాక్షసుడి హేయమైన, చర్యలు మరికొన్ని వెలుగులోకి వచ్చాయి. మహిళల మృతదేహాలపై లైంగిక చర్య జరిపేవాడినని, అలా 101 మందిపై చేశానని ఆ సైకో కోర్టుకు వెల్లడించాడు.

సైకో డేవిడ్ ఫుల్లర్
సైకో డేవిడ్ ఫుల్లర్

UK murderer admits abusing 101 dead women; ఒళ్లు గగుర్పొడిచే దారుణం ఇది. ఇంగ్లండ్ లోని ఒక ఆసుపత్రిలో ఎలక్ట్రీషియన్ గా పనిచేసే ఓ సైకో ఆ ఆసుపత్రిలోని మార్చురీలో ఉన్న మృతదేహాలతో సెక్స్ చేసేవాడినని వెల్లడించాడు. అలా 101 మందిపై లైంగిక దాడి చేశానని ఆ సైకో కోర్టుకు వెల్లడించాడు.

ట్రెండింగ్ వార్తలు

UK murderer admits abusing 101 dead women; ఇప్పటికే జైళ్లో..

ఇద్దరు యువతులను హత్యాచారం చేసిన నేరంతో పాటు, శవాలతో సెక్స్ చేశాడన్న ఆరోపణలపై ఆ నరరూప రాక్షసుడు ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. తాజాగా, తన దారుణాలను మరికొన్నింటిని అతడు కోర్టుకు వెల్లడించాడు.

UK murderer admits abusing 101 dead women; మొత్తం 101 శవాలతో..

68 ఏళ్ల డేవిడ్ ఫుల్లర్ ఆగ్నేయ ఇంగ్లండ్ లోని కెంట్ లోని ఒక ఆసుపత్రిలో ఎలక్ట్రీషియన్ గా పని చేసేవాడు. 1987లో కొన్ని నెలల వ్యవధిలో 25 ఏళ్ల వెండీ నెల్, 20 ఏళ్ల కేరొలిన్ పై అత్యాచారం చేసి, హత్య చేశాడు. ఈ నేరాలతో పాటు, మరో దారుణమైన నేరాన్ని కూడా చేశానని అతడు పోలీసుల విచారణలో అంగీకరించాడు. తను పని చేసే ఆసుపత్రిలోని మార్చురిలో ఉన్న 78 మృతదేహాలపై లైంగిక దాడి చేసినట్లు అంగీకరించాడు. ఆనేరాలపై అతడు ప్రస్తుతం యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడు.

UK murderer admits abusing 101 dead women; మరో 23 మందిపై..

ఇటీవల కోర్టు విచారణలో మరో వాస్తవాన్ని డేవిడ్ ఫుల్లర్ వెల్లడించాడు. తను మొత్తం 101 శవాలపై లైంగిక దాడి చేశానని కోర్టుకు తెలిపాడు. గతంలో చెప్పిన 78 కాకుండా, మరో 23 మృతదేహాలపై కూడా లైంగికదాడి చేశానని వెల్లడించాడు. ప్రస్తుతం బాధిత కుటుంబాల నుంచి వాంగ్మూలం తీసుకుంటున్నారు. అనంతరం, ఆ సైకోకు శిక్షను ఖరారు చేయనున్నారు.

WhatsApp channel